తారకరత్న పెద్ద కర్మ(శ్రద్ధాంజలి) మార్చి 2న నిర్వహించనున్నారు. అయితే ఈ పెద్ద కర్మ కార్డ్ లో తారకరత్న పేరెంట్స్ పేర్లు మిస్సింగ్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
తారకరత్న ఇటీవల అనారోగ్యంతో పోరాడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇది నందమూరి ఫ్యామిలీలోనేకాదు, టాలీవుడ్‌లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. యంగ్ ఏజ్‌లోనే మరణించడంతో అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే తారకరత్నకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు బాలకృష్ణ ముందుండి చూసుకుంటున్న విషయం తెలిసిందే. లోకేష్‌తో `యువగళం` పాదయాత్రలో గుండె పోటు రావడంతో కుప్పకూలిన తారకరత్నని ఆసుపత్రికి తరలించడం నుంచి, బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు తరలించడం, అక్కడి చికిత్స అందించడం వరకు అన్నీ బాలయ్యనే చూసుకున్నారు.
ఆ తర్వాత చనిపోయాక అంత్యక్రియలను ముందు నిర్వహించారు. అంతటితో ఆగలేదు, పెద్ద కర్మ(శ్రద్ధాంజలి) కార్యక్రమాలు కూడా బాలయ్యనే నిర్వహిస్తున్నారు. విజయసాయిరెడ్డి, బాలయ్య కలిసి ఈ దశదిన కర్మ చేస్తున్నారు. ఇందులో తారకరత్న భార్య అలేఖ్య, వారి పిల్లల పేర్లు కుమార్తె నిష్క, కుమారుడు తనయ్ రామ్, కుమార్తె రేయ పేర్లు మెన్షన్ చేశారు. మరో పక్క అలేఖ్య రెడ్డి కుటుంబానికి సంబంధించిన టి మధుసూదన్ రెడ్డి, టి శ్రీ హరిప్రియ, టి అవనీష్, టి ముక్తి అనే పేర్లు రాశారు. కానీ ఎక్కడా తారకరత్న తల్లిదండ్రుల పేర్లు మెన్షన్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
తారకరత్న.. అలేఖ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది వారి పేరెంట్స్ మోహనకృష్ణ, శాంతిలకు ఇష్టం లేదని తెలుస్తుంది. దాని కారణంగా తారకరత్న పెద్ద కర్మ చేసేందుకు వాళ్లు ముందుకు రాలేదని టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్. నిజానికి బెంగుళూరులో ఆసుపత్రికి వచ్చారు. తారకరత్న చనిపోయాక ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ శివారులో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చారు. అక్కడే ఫ్యామిలీ మెంబర్స్ సందర్శనార్థం ఒక్క రోజు ఉంచారు. కానీ తారకరత్న ఇంటికి వారి పేరెంట్స్ రాలేదు. ఫిల్మ్ ఛాంబర్‌కి భౌతిక కాయం వచ్చాక అక్కడికి వచ్చారు. అంత్యక్రియలు నిర్వహించారు.
ఇప్పుడు పెద్ద కర్మకి సంబంధించిన కార్డ్ లోనూ వాళ్ల పేర్లు లేవు. దీంతో తారకరత్న, అలేఖ్యలపై ఉన్న కోపంతోనే వాళ్లు దీనికి దూరంగా ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొడుకు పెద్దకర్మని తల్లిదండ్రులు చేయకపోవడమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. టాలీవుడ్‌లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ ఇది పెద్ద చర్చకి దారితీస్తుంది. మరీ నిజంగానే కోపంతో ఉన్నారా? దాని కారణంగానే ఈ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారా? లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. మార్చి 2న హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్‌లో తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బాలయ్య, విజయసాయిరెడ్డి.
