బాలయ్య,బోయపాటి మూవీలో మరో నందమూరి హీరో
రీసెంట్ ఈ మూవీ తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కోసం మరో నందమూరి హీరోని ఎంపిక చేసారని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు నందమూరి తారకరత్న అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన యంగ్ ఎమ్మల్యే గా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని ,తారకరత్నకు మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చే పాత్ర అవుతుందని చెప్తున్నారు.
సింహా, లెజండ్ చిత్రాల తరువాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో మూడో మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కి ముందే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఆ మధ్య బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ అభిమానులను చాలా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ కరోనాతో ఆగిపోయింది. అయితే రీసెంట్ ఈ మూవీ తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కోసం మరో నందమూరి హీరోని ఎంపిక చేసారని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు నందమూరి తారకరత్న అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన యంగ్ ఎమ్మల్యే గా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని ,తారకరత్నకు మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చే పాత్ర అవుతుందని చెప్తున్నారు.
ఇక బిబి3 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనివినపడుతోంది. మరో ప్రక్క ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, హీరోయిన్ గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. తెలుగు అమ్మాయి అంజలి ఈ సినిమా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి ఇక ఈ సినిమాకు మోనార్క్ ను ఖరారు చేసే విషయంలో యూనిట్ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. మోనార్క్ టైటిల్ వల్ల ఖచ్చితంగా సినిమా గురించి జనాల్లో చర్చ జరగడంతో పాటు టైటిల్ చాలా క్యాచీగా ఉంటుందని టీమ్ భావిస్తున్నారు. త్వరలోనే టైటిల్ విషయంలో తుది నిర్ణయం తీసుకుని షూటింగ్ మొదలు అయిన వెంటనే పోస్టర్ లేదా టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్ .
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రామీణ నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్ ను షూట్ చేయనున్నారు అని సమాచారం. ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి చెప్పిన విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.