మహానటి విషయంలో తారక్ మాట నిజమైంది

Tarak compliments to mahanati team
Highlights

మహానటి విషయంలో తారక్ మాట నిజమైంది

‘మహానటి’గా కీర్తి సురేష్ నటించిన తీరు వర్ణించలేనిది.. ఆమె నటన గురించి మాట్లాడాలంటే మాటలు రావడం లేదు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా నటించచేశారేమో’ అంటూ ట్విట్టర్‌లో మహానటి చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’  ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. ఈ సందర్భంగా సాధారణ ప్రేక్షకులే కాకుండా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ‘జయహో మహానటి’అంటూ ఈ చిత్రంపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

ఇక ‘మహానటి’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి ఆడియో లాంచ్ చేసిన ఎన్టీఆర్ యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో తన  స్పీచ్‌తో అదరగొట్టేశారు. ‘ఆ ‘మహానటి’ హుందా గురించి, గొప్పదనం గురించి మాట్లాడే అర్హత.. ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలెత్తినా రాదు. ట్రూ లేడీ సూపర్ స్టార్ మహానటి సావిత్రి. ఆవిడ ఔన్నత్యాన్ని పొగిడే అర్హత లేని వారం మేము. కొంత మంది జీవితాలను తెలుసుకోవడం మనకు అవసరం.. కొంత మంది సాధించిన విజయాల్ని ఆదర్శంగా పొందటం అవసరం.

ఒక్కసారి ఈ చిత్రం చూసిన తరువాత ఎందుకు మనం మగాళ్లగా పుట్టాం అని అనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఒక ఆడదాని బలం ఏంటో దట్ ఈజ్ ట్రూ సూపర్ స్టార్ సావిత్రి. ఆడవాళ్లు తలచుకుంటే ఏం సాధించగలరన్నది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది.. ఈ సినిమా చూసైనా ఆడవాళ్లపై గౌరవిస్తారని భావిస్తా.. సావిత్రిగారు ఎలా పోయారు అని కాదు... ఎలా బతికారు అని కళ్లకు కట్టి చూపించే చిత్రం 'మహానటి'.’ అంటూ ఎన్టీఆర్ ‘మహానటి’ ఆడియో వేడుకలో మాట్లాడిందే సినిమా విడుదల తరువాత అక్షర సత్యాలుగా నిలిచాయి.
 

loader