స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలో నటిస్తోన్న తారా సుతారియా తన సహ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.  తాజాగా ఈ విషయంపై నటి తారా క్లారిటీ ఇచ్చింది.

సిద్ధార్థ్ తాను డేటింగ్ చేస్తున్నానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. తామిద్దరం మంచి స్నేహితులమని ఓ రేడియో ఛానెల్ లో చెప్పుకొచ్చింది. సిద్ధార్థ్ తన ఇంటి దగ్గర్లోనే ఉంటారని, అతకుమించి అతడు మంచి స్నేహితుడని, మేం ఎప్పుడూ డేటింగ్ లో లేమని తనపై వస్తోన్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.

కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తారాను సిద్ధార్థ్ గురించి ప్రశ్నిస్తే ఈ రకమైన సమాధానమే చెప్పుకొచ్చింది. ఇటీవలే ఈ బ్యూటీ 'మర్జావన్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది.