'అర్జున్ రెడ్డి' రీమేక్ నుండి హీరోయిన్ అవుట్.. కారణమేమిటంటే..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 7, Sep 2018, 5:16 PM IST
Tara Sutaria no more part of Arjun Reddy remake
Highlights

తెలుగులో ఘన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా తారా సుతారియా హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది

తెలుగులో ఘన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా తారా సుతారియా హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది. ఒరిజినల్ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు.

ఈ నెలాఖరు నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా నుండి హీరోయిన్ తారా తప్పుకుంది. ప్రస్తుతం ఆమె 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' లో నటిస్తోంది. ఇది ఆమెకు మొదటి సినిమా. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ 23న విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు వాయిదా పడింది. దీంతో ఇప్పుడు ఆమె షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండడంతో డేట్స్ కుదరక 'అర్జున్ రెడ్డి' రీమేక్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై స్పందించిన చిత్ర నిర్మాత త్వరలోనే హీరోయిన్ ను ఎంపిక చేసి తెలియజేస్తామని అన్నారు. తెలుగులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 

loader