ఆ హీరోతో నా రిలేషన్ ఏంటంటే.. తారా చౌదరి క్లారిటీ!

First Published 10, Aug 2018, 3:43 PM IST
Tara Chowdary Reveals Relation with Rajashekar
Highlights

గతంలో హీరో రాజశేఖర్ తో తారా చౌదరికి ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తుందనే వార్తలు బలంగా వినిపించాయి. ఆ వార్తలను రాజశేఖర్ ఖండించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తారా చౌదరి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. రాజశేఖర్ తో ఆమెకున్న రిలేషన్ ఏంటో చెప్పుకొచ్చింది

ఒకప్పుడు జాతీయ మీడియాలో సైతం మార్మోగిన పేరు తారా చౌదరి. అప్పట్లో టాలీవుడ్ సెక్స్ స్కాండిల్ అలానే పొలిటికల్ ఇండస్ట్రీలోనూ తారా చౌదరి పేరు సంచలనాలు సృష్టించింది. తాజాగా మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. గతంలో హీరో రాజశేఖర్ తో తారా చౌదరికి ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తుందనే వార్తలు బలంగా వినిపించాయి. ఆ వార్తలను రాజశేఖర్ ఖండించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తారా చౌదరి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. రాజశేఖర్ తో ఆమెకున్న రిలేషన్ ఏంటో చెప్పుకొచ్చింది. ''హీరో రాజశేఖర్ అంటే నాకు చాలా అభిమానం. 'మా అన్నయ్య' సినిమాలో ఆయన నటన నన్ను ఆకట్టుకుంది. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్ ని కలిసి మీరంటే నాకు చాలా అభిమానమని, 'మా అన్నయ్య' సినిమా బాగా నచ్చిందని ఆయనకి చెప్పాను. ఆయన కూడా సంతోషపడ్డారు. ఆ తరువాత శ్రీనగర్ కాలనీలో నేనుండే ఫ్లాట్ పక్కన ఓ ఫ్లాట్ ఖాళీగా ఉందని దాన్ని చూడడానికి జీవిత రాజశేఖర్ దంపతులు వచ్చారు.

అలా కొన్ని సందర్భాల్లో వారిని కలిశాను. ముఖ పరిచయం తప్ప మా మధ్య ఇంకేం లేదు. వ్యక్తిగతంగా రాజశేఖర్, జీవితలు మంచి మనుషులు. బయట వినిపిస్తోన్న రూమర్స్ లో నిజం లేదు. అప్పట్లో ఓ షూటింగ్ లో రాజశేఖర్, జీవితతో కలిసి సెల్ఫీ దిగాను. దాన్ని చూసి కూడా రకరకాలుగా మాట్లాడారు'' అంటూ చెప్పుకొచ్చింది.   

loader