సినీ నటి తారా చౌదరి తన బావ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం.. తారా చౌదరి(31)కి బావ వరసయ్యే చావ రాజ్ కుమార్, ఆయన సోదరి సుజాతకి సన్నిహిత సంబంధాలు ఉండేవి.

ఈ క్రమంలో రాజ్ కుమార్ ని వివాహం చేసుకోవాలని సుజాత.. తారా చౌదరి కోరింది. అయితే రాజ్ కుమార్ కి గతంలో వివాహమైందని తారా చౌదరి ప్రశ్నిస్తే విడాకులు తీసుకున్నాడని చెప్పిందట. కానీ మొదటి నుండి రాజ్ కుమార్ తో పెళ్లి విషయాన్ని నిరాకరిస్తూ వస్తోంది తారా చౌదరి.

బంజారాహిల్స్ నుండి తన మకాంని విజయవాడకి మార్చింది. రాజ్ కుమార్ అక్కడకి కూడా వచ్చి తారా చౌదరి చుట్టుపక్కన వారికి తన భర్తగా పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు తారా చౌదరి పెళ్లి చేసుకోవాలని రాజ్ కుమార్ ని అడుగుతుంటే అతడు మాత్రం తప్పించుకొని తిరుగుతున్నాడట.

అతడిపై ఎంత ఒత్తిడి చేస్తున్నా.. నిరాకరించడంతో మోసం చేశాడని గ్రహించి బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేసింది.