సొట్ట బుగ్గల సుందరి తాప్సి సౌత్ లో పెద్దగా విజయాలు అందుకోలేదు. కానీ బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత తాప్సికి మంచి క్రేజ్ లభించింది. గ్లామర్ రోల్స్ తో పాటు వైవిధ్యం ఉన్న చిత్రాల్లో నటించడంతో తాప్సికి వరుస విజయాలు దక్కాయి. ఈ ఏడాది తాప్సి బద్లా చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తాప్సి గేమ్ ఓవర్, మిషన్ మంగళ్ లాంటి చిత్రాల్లో నటిస్తోంది. 

తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సి క్రేజీ హీరో విక్కీ కౌశల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాప్సి, విక్కీ కౌశల్ మన్మార్జియాన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ అభిషేక్ బచ్చన్, తాప్సి, విక్కీ కౌశల్ నటనకు ప్రశంసలు దక్కాయి. వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్ ముగ్గురిలో చంపాల్సి వస్తే ఎవరిని.. పెళ్లి ఎవరితో, స్నేహం ఎవరితో అని ప్రశ్నించగా తాప్సి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 

వరుణ్ ధావన్ తో స్నేహం చేయడం ఇష్టం. ఇక చంపాల్సి వస్తే అది అభిషేక్ బచ్చన్ నే అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకోవాల్సి వస్తే విక్కీ కౌశల్ ని చేసుకుంటా. విక్కీ కౌశల్ చూడడానికి అంత హాట్ గా ఉండదు. కానీ పెళ్ళికి మాత్రం పనికొస్తాడు అంతో సరదాగా కామెంట్స్ చేసింది. గతంలో తమన్నా కూడా విక్కీ కౌశల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. తనకు విక్కీ కౌశల్ తో డేటింగ్ చేయాలని ఉన్నట్లు తమన్నా వెల్లడించింది. యురి చిత్రం తర్వాత విక్కీ కౌశల్ అమ్మాయిల కలల రాకుమారిడిలా మారిపోయాడు. 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి