మ‌రి రెండు రోజుల్లో బిగ్‌బాస్ సీజ‌న్ 4 సందడి మొద‌ల‌వ‌బోతున్న సంగతి తెలిసిందే. ఈమేర‌కు ఏర్పాట్ల‌న్నీ జ‌రిగిపోతున్నాయి. ఇప్ప‌టికే 16 మంది కంటెస్టెంట్స్‌ ఎంపిక చేసిన మేక‌ర్స్,  వారంద‌రికీ  కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి నెగెటివ్ అని నిర్థార‌ణ అయ్యాక‌ ఓ  స్టార్ హోట‌ల్‌లో ఉంచినట్లు తెలుస్తుంది. అలాగే ప్రారంభ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్‌ని రేపు(శనివారం) చేసేందుకు టీమ్‌ సిద్ధమైంది. అయితే ఈ లోపే బిగ్‌బాస్‌ నిర్వాహక టీమ్ కు మరో కంటెస్టెంట్‌ షాక్ ఇచ్చినట్లు వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి.

 ఈ సీజన్‌ నుంచి బుల్లితెర హీరోయిన్, ముద్దమందారం ఫేమ్ తనూజ పుట్టస్వామి ఔట్ అయినట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ ఇబ్బందుల వలన ఈ సీజన్ నుంచి ఆమె బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో టీమ్ ఈ లాస్ట్ మినిట్ ట్విస్ట్ కు తలపట్టుకున్నారని టాక్‌.

అంతేకాదు ఈ వారంలోనే రఘు మాస్టర్ సైతం బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చినట్లు టాక్‌. ఇక మరో ముగ్గురికి కరోనా సోకిందని కూడా సమాచారం.  అప్పటికీ బిగ్ బాస్ హౌస్ సిబ్బంది సంఖ్యను తగ్గించి, హౌస్ లో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని బిగ్ బాస్ నిర్వాహకులు  చెప్పారట. 
 
ఇక బిగ్‌బాస్‌ సీజన్‌4 ను గతం కంటే డిఫరెంట్‌గా, మరింత ఆకర్షణీయంగా ఉండేలా ప్లాన్‌ చేశారట మేకర్లు. బుల్లితెరపై పేరుమోసిన యాంకర్లు, ఇతర నటీనటులతో పాటుగా టిక్‌టాక్‌ స్టార్లను కూడా ఈ సారి షోకు ఎంపిక చేశారట. ఈ సీజన్‌లో జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్ నోయల్‌ సేన్‌, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్‌ సే, గంగవ్వ, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌లు కంటెస్టెంట్‌లుగా ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ట్విస్ట్ లతో ఎవరు ఈ షోలో పాల్గొనబోతున్నారనేది పెద్ద ప్రశ్నగా మారింది.