చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తనీష్ బిగ్ బాస్ తో బాగానే పాపులర్ అయ్యాడు. కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ తనదైన శైలిలో ముందుకు వెళ్లి ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ అచ్చమైన తెలుగబ్బాయి కెరీర్ లో ఇంకా సరైన హిట్ అందడం లేదు. రీసెంట్ గా రంగు ఆ నే సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. 

ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇకపోతే తనీష్ గెలుపోటములను పక్కనపెట్టి నేడు తన మనసుకు నచ్చిన ఒక మంచి పని చేసి అది తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. చూపు లేని నాగమణి  అనే యువతి కోసం పరీక్ష రాసి సహాయం చేశాడు. 

అదే విధంగా జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏ విధమైన అనుభవాలను నేర్పుతాయి అనే విషయాల్ని క్లుప్తంగా వివరించాడు. అంతే కాకుండా నేడు చేసిన ఒక పని చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఈ కుర్ర హీరో పేర్కొన్నాడు.