ముగిసిన తనీష్ సిట్ విచారణ 4 గంటలపాటు విచారించిన సిట్ తెలిసిన సమాచారమంతా ఇచ్చానన్న తనీష్
బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి తనీష్‌ను తర్వాత హీరోగా మారారు. హీరోగా పెద్దగా సక్సెస్ సాధించక పోయేసరికి సైడ్ హీరోగా కూడా ట్రై చేశాడు. ఆ మద్య తనీష్ పై డ్రగ్స్ ఆరోపణ`లు వచ్చాయి. అంతే కాదు తండ్రి మరణం తర్వాత తనిష్ డిప్రెషన్ లోకి వెళ్లాడని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ అవన్నీ పక్కన బెట్టి కృష్ణ వంశి తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం’ చిత్రంలో నటిస్తున్నాడు తనిష్. ఈ చిత్రంలో మనోడు ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడట.
తాజాగా టాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో సోమవారం తనిష్ సిట్ ముందు హాజరయ్యారు. 4గంటల పాటు తనీష్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు. సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పినట్లు తెలిపారు. తండ్రి చనిపోయిన విషాదం నుండి ఇంకా దూరం కాలేదన్నారు. విందులు ,వినోదాలకు దూరమయ్యాను. ఏదైనా రాసే ముందు నిర్ధారణ చేసుకోవాలని ఆయన సూచించారు.
డ్రగ్ రాకెట్ ముఠాకు చెందిన కెల్విన్ అరెస్ట్ తర్వాత 12 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరీ జగన్నాథ్, రవి తేజ, చార్మీ కౌర్, శ్యాం కే నాయుడు, రవి తేజ డ్రైవర్, ముమైత్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. మొదట డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు జాబితాలో ఉండటంపై తనీష్ ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు సినీ ప్రముఖులు అందిస్తున్న సమాచారం సేకరించి ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
