సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన స్నేహితుడు.. ఈ మధ్య మరణించిన తమిళ స్టార్ కమెడియన్ మాయిల్ సామి ఆకరికోరికను తాను తీరుస్తానని ప్రకటించారు రజినీకాంత్. ఇంతకీ ఆయన కోరిక ఏంటీ..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్..కోలీవుడ్ లో కూడా పేరున్న నటులు లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. ఈక్రమంలోనే లాస్ట్ ఇయర్ నుంచి వరుసగా సినిమా తారలు తిరిగిరాని లోకాలకువెళ్ళిపోతున్నారు. రీసెంట్ గా విశ్వనాథ్, వాణీ జయరామ్, తారకరత్న మరణవార్తలను జీర్ణిచుకోలేక పోయింది సినీ పరిశ్రమ. అన్ని భాషల్లో ఈ విషాదాలు తప్పడంలేదు. టాలీవుడ్ లోవరుస మరణాలు మరువకముందే తమిళ ఇండస్ట్రీలో మరో నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ప్రముఖ కోలీవుడ్ హస్యనటుడు మయిల్‌స్వామి కన్నుమూశాడు.
మయిల్ స్వామి మరణంతో తమిళ తారా లోకం అంతా కదిలివచ్చి నివాళి అర్పించింది. ఎన్నో ఏళ్ళు కమెడియన్ గా నవ్వించిన మయిల్ స్వామి సడెన్ గా మరణించడంతో.. కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్లు కూడా ఆవేదన వ్యాక్తం చేశారు. ఈక్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. మయిల్ స్వామి చివరికోరికను తాను తీరుస్తాన్నారు. అంతే కాదు అది తనతోనే ముడిపడి ఉందన్నారు రజనీకాంత్. తలైవా మాట్లాడుతూ.. మేము మంచి స్నేహితులం కాని ఇద్దరం ఎక్కువ సినిమాల్లో నటించలేదు. మాయిల్ ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు అతనుకోలేదు. అన్నారు.
మాయిల్ శివభక్తుడు.. అతనికి ఎమ్జీఆర్ అంటే కూడా చాలా ఇష్టం.. నేను అతడ్ని సినిమా గురించి అడిగే వాడిని. కానీ, అతడు ఎమ్‌జీఆర్, శివుడి గురించి మాత్రమే చెప్పేవాడు. ఆయన ప్రతీ ఏడాది కార్తీకపౌర్ణమి రోజున తిరువన్నామలై వెళ్లేవాడు. శివ ధ్యానంలో చాలా సంతోషించేవాడు. ఆరోజు అక్కడికి వెళదామని చెప్పేవాడు. ఒక సారి కొన్ని నెలల క్రితం నాకు ఫోన్ కూడా చేశాడు. నేను పని బిజీలో ఉండి ఫోన్ తీయలేదు. కానీ, ఇప్పుడు మాట్లాడదామన్న మాయిల్ లేకుండా పోయాడు అన్నారు. అంతే కాదు పరమశివభక్తుడైన మాయిల్‌సామి శివరాత్రి రోజే చనిపోయాడు. అది దేవుడి నిర్ణయం. తన ప్రియ భక్తుడ్ని దేవుడు తన దగ్గరకే తీసుకెళ్లిపోయాడు అన్నారు సూపర్ స్టార్.
అంతే కాదు మాయిల్ చివరికోరిక నేను తిరువన్నామలై గుడిని దర్శించాలనేది. నేను అక్కడికి వెళ్తే చూడాలని ఆయన అనుకున్నారు. ఇదే విషయాన్ని డ్రమ్స్ శివమణికి చెప్పారు. నేను శివమణితో మాట్లాడతాను. మాయిల్‌సామి చివరి కోరికను తీరుస్తాను అని అన్నారు. మయిల్ స్వామి 1984లో సినీరంగ ప్రవేశం చేశారు. ధవని కనవుగల్ అనే తమిళ సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. తన మార్క్ కామెడీతో ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ దృష్టిలో పడ్డాడు. దాంతో ప్రేక్షకుల ఆదరణతో వరుస అవకాశాలు మయిల్ స్వామిని వెతుక్కుంటూ వచ్చాయి. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు మయిల్‌స్వామి .. వరుస సినిమాత స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడేు. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు తమిళ కమెడియన్.
దాదాపు 40 ఏళ్లు.. 200 సినిమాలతో .. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు మయిల్ స్వామి.లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ది లెజెండ్ సినిమాలోనూ మయిల్‌స్వామి మంచి పాత్ర పోషించాడు. ఇక కమెడియన్ గా అవకాశాలు తగ్గినా.. తక్కువలో తక్కువ ఏడాదికి అయిదారు సినిమాలైనా చేస్తూ వస్తున్నాడు మైయిల్ స్వామి. ఇక స్టార్ కమెడియన్ మరణంతో తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు కమల్ హాసన్, లాంటిస్టార్స్ సంతాపం ప్రకటించారు. కోలీవుడ్ ప్రముఖ నటులు కూడా ఆయనకు నివాళి అర్పించారు. అంత్య క్రియలను ఘనంగా నిర్వహించారు.
