గెస్ట్ రోల్ కోసం అన్ని కోట్లా.. రజినీకాంత్ లాల్ సలామ్ కోసం ఎంత తీసుకున్నాడోతెలుసా..?
ఏంత పెద్ద స్టార్ హీరో అయినా.. గెస్ట్ రోల్ కోసం మహా అయితే ఎంత తీసుకుంటారు.. రెండు మూడు కోట్లు.. లేదా 10 కోట్ల లోపు తీసుకుంటారేమో అనుకుంటాం. కాని సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
వరుస ఫెయిల్యూర్స్ ఎదురైనా ఏమాత్రం తగ్గలేదు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన రెమ్యూనరేషన్ కూడా ేమాత్రం తగ్గించుకోలేదు. ఈ విషయంలో విమర్షలు కూడా ఫేస్ చేశారు తలైవా.. ఈక్రమంలో ఆయనకు జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పడటంతో.. రజినీమార్కెట్ మళ్ళీ మొదలైంది. ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రబంజనం సృష్టించింది. జైలర్ సూపర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మరింత ఉత్సాహంతో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఆయన తన కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో చేస్తున్న సినిమా లాల్ సలామ్. రజనీ అతిథి పాత్రలో మాత్రమే నటించినా.. లాల్ సలామ్ ఆయన సినిమాగానే ప్రమోటో అవుతోంది.
క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిరోషా, తంగదురై మరియు ధన్య బాలకృష్ణన్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందించి సినిమా క్రేజ్ ను మరింతగా పెంచేశారు. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకలో అన్ని పాటలు విడుదలై విశేష స్పందన లభిస్తోంది. ఇక లాల్ సలామ్ ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తమిళనాట విడుదల హక్కులను రెడ్ జెయింట్ సొంతం చేసుకోవడంతో లాల్ సలామ్ తమిళనాడులో కూడా ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.
సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన రజనీకాంత్ ఎంత పారితోషికం తీసుకున్నాడు అన్న విషయంలో వార్త వైరల్ అవుతుంది. మూవీ టీమ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం లాల్ సలామ్‌లో మొయిదీన్ భాయ్‌గా నటించడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ర 40 కోట్లు తీసుకున్నారని టాక్.
క్యామియో రోల్ చేయడానికి ఇంత డబ్బు నిజంగా తీసుకుని ఉంటారా అని అంతా అనుమానం వ్యాక్తం చేస్తుండగా.. ఈసినిమాకు మార్కెట్ అవ్వడానికి కారణమే రజినీకాంత్ కావడం.. ఈ మూవీ రజనీకాంత్ సినిమాగా ప్రచారం జరగడంతో లాల్ సలామ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. అందుకే లైకా సంస్థ రజనీకాంత్ కు భారీ మొత్తం చెల్లిచినట్టు తెలుస్తోంది.