సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్నారు. చాలా కాలం గ్యాప్ తరువాత అక్కడికి వెళ్లిన ఆయన.. ప్రశాంత వాతావరణంలో మనశ్శాంతిని పొందుతున్నారు. తలైవా హిమాలయాలకు సబంధించిన ట్రిప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ జీవితం తెరిచిన పుస్తకం. ఆయనలో ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువ.. ఆ విషయం అందరికి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తారు. అక్కడ రుషులను కలుసుకుని ధ్యానం చేసి.. ప్రశాంతతను పొందుతారు. ఆయన హిమాలయాల దర్శనం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కాని ఆయన వెళ్లడం వరకే అందరికి తెలిసింది. అక్కడ ఏం జరుగుతుంది. ఏం చేస్తారు అనే విషయాలు మొత్తంగా క్లారిటీ లేదు. 

ఇక మరో విషయం ఏంటంటే. రజనీకాంత్ సినిమాల రిలీజ్ లు ఉంటే.. రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్తారు. రిలీజ్ రోజు ఆయన అక్కడే ఉంటేట్టు చూసుకుంటారు. ఇక క‌రోనా వ‌ల్ల గ‌త నాలుగు సంవ‌త్సరాలు హిమాలయాల‌కు దూరంగా ఉన్న ర‌జినీ త‌న తాజా సినిమా జైల‌ర్ రిలీజ్ కు ముందు హిమాలయాలకు వెళ్లారు. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెర‌కెక్కించిన తాజా చిత్రం జైల‌ర్. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Scroll to load tweet…

పాజిటీవ్‌ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది జైలర్ సినిమా.. అన్నాత్తే భారీ డిజాస్టార్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్, బీస్ట్ ప్లాఫ్ త‌ర్వాత ఇద్దరి కాంబోలో సూపర్ డూపర్ హిట్ వచ్చిందంటున్నార ఆడియన్స్. ఈ ఇద్దరు స్టార్లు మాస్ కంబ్యాక్ ఇచ్చార‌ని ఫ్యాన్స తెగ ముచ్చట పడుతున్నారు. రజనీకాంత్ మార్కెట్ గురించి మాట్లాడినవారికి జైలర్ సినిమా గట్టి సమాధానం అయ్యింది అంటున్నారు. ఇక తన సినిమాల విడుదలకు ముందు ర‌జినీ హిమాలయా యాత్రకు వెళ‌తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ‌ల్ల గ‌త నాలుగు సంవ‌త్సరాలు హిమాలయాల‌కు దూరంగా ఉన్న ర‌జనీ జైల‌ర్ విడుద‌ల‌కు ముందు హిమాలయాలకు వెళ్లారు. 

త‌న స్నేహితుల‌తో క‌లిసి ర‌జనీ హిమాలయాలకు వెళ్లగా.. అక్కడ ఆయన సందడి చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్ంగా ఓ బ్రిడ్జ్ పై.. త‌న ఫ్రెండ్స్ తో కలిసి తలైవా దిగిన ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. తెల్లటి కుర్తా, పైజామా ధరించి, నుదుటిపై బొట్టు పెట్టుకుని ర‌జనీ ఉన్నాడు.