తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి త్వరలో రాజకీయాలకు రాబోతున్నారంటూ వార్త తమిళనాట జోరందుకుంది. ఈ వార్తలపై స్పందించారు విజయ్. తన రాజకీయ ఆరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు.
తమిళ రాజకీయాలలో మరోసారి సినీతారల పేర్లు జోరందుకున్నాయి. విజయ్ దళపతి, అజిత్, విశాల్, ఇలా వరుసగా స్టార్లు పేర్లు వినిపిస్తున్న క్రమంలో.. ప్రస్తుతం మరో స్టార్ యాక్టర్ పేరు తెరపైకి వచ్చింది. తమిళ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతి పేరు బాగా వినిపిస్తోంది. విజయ్ సేతుపతి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని, సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఈ వార్తలు ఎక్కువ అవ్వడంతో దీనిపై విజయ్ సేతుపతి స్పందించారు. ఈ వార్తలపై క్లారిటీ కూడా ఇచ్చారు విజయ్.
పొలిటికల్ ఎంట్రీ గురంచి విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. తనకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉందని చెప్పారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని తెలిపారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 70వ పుట్టినరోజును పురస్కరించుకుని చెన్నైలోని తేనాంపేటలో స్టాలిన్ 70 పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ కు విజయ్ సేతిపతి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా విజయ్ ను రాజకీయాల గురించి ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానంచెపుతూ.. ఈ విధంగా స్పందించారు విజయ్.
ఇక ఇదే సమయంలో స్టాలిన్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. వారసత్వంతో స్టాలిన్ సీఎం కాలేదని... కఠోరశ్రమతో సీఎం పదవిని చేపట్టారని చెప్పారు. తమిళ నాట ఏ బ్రాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగినవారిలో విజయ్ సేతుపతి ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆఱ్టిస్గ్ గా ఆయన స్టార్ డమ్ తో దూసుకుపోతున్నారు. ఇక తమిళనాట రజనీకాంత్ రాజకీయాలకు రాను అని చెప్పడంతో.. ఇతర సినిమా తారలను తెరపైకి తీసకోస్తున్నారు. వచ్చే ఎలక్షన్స్ వరకూ..తమిళనాటు తెర రాజకీయాలు వెలుగు వెలిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
