Asianet News TeluguAsianet News Telugu

యాక్సిడెంట్ లో సూర్య అభిమాని మృతి.. ఇంటికెళ్లి కుటుంబికులను ఓదార్చిన తమిళస్టార్

తమిళ స్టార్ సూర్య ఫ్యాన్స్ వరుసగా చనిపోతున్నారు. తాజాగా మరో అభిమాని మృతికి ఆయన చింతించారు. నేరుగా ఇంటికి వెళ్లి మరీ అభిమాని తల్లిదండ్రులు ఓదార్చారు. 
 

Tamil Star Suriya condolences to his die hard fan death NSK
Author
First Published Sep 28, 2023, 3:54 PM IST

తమిళ స్టార్ సూర్య (Suriya) ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ ఆయనను అభిమానించే వారు తెలుగులోనూ ఉండటం విశేషం. సూర్య సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సినిమాలను, బర్త్ డేలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే కొద్దికాలంగా సూర్యను అమితంగా ప్రేమించే అభిమానులు మరణిస్తుండటం బాధాకరం. 

ఈ ఏడాది సూర్య పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో సూర్య కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియోను విడుదల చేశారు. తన ఫ్యాన్స్ కు నివాళి అర్పించారు. ఆ కొద్దిరోజులకే యూఎస్ఏలో మరో లేడీ ఫ్యాన్ అక్కడ జరిగిన కాల్పుల్లో మరణించింది. అప్పుడూ సూర్య వారి తల్లిదండ్రులను ఓదార్చుతూ లేఖ రాశారు. ఇటీవల మరో అభిమాని యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.

చెన్నైలోని ఎన్నూర్ లో నివాసం ఉంటున్న అరవింద్ సూర్యకు వీరాభిమాని. కొన్నేళ్లుగా సూర్య ఫ్యాన్స్ క్లబ్ లో సభ్యుడిగా ఉన్నారు. సూర్య సినిమాలు, బర్త్ డేలకు, ఇతర ఫంక్షన్లను ఎంతో సంతోషంగా సెలబ్రేషన్స్ ను చేస్తూ వచ్చారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో అరవింద్ ప్రాణాలొదిలాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య వెంట మృతుడి ఇంటికి వెళ్లారు. శోకసంద్రంలో మునిగి తల్లిదండ్రులను ఓదార్చారు. అరవింద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. సూర్య అభిమానులు ఇలా ప్రమాదవశాత్తు మరణించడం పట్ల నెటిజన్లూ చింతిస్తున్నారు. ఇక సూర్య తన ఫ్యాన్స్ పై చూపించే ప్రేమను అభినందిస్తున్నారు. ప్రాణాలు వదిలిన అభిమానులకు కుటుంబాలకు అండగా ఉంటుండటం పట్ల  మెచ్చుకుంటున్నారు. ఇక సూర్య  ప్రస్తుతం ‘కంగువ’ (Kanguva) చిత్రంలో నటిస్తున్నారు. కోలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. పదిభాషల్లో త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ ఫిల్మ్ వచ్చే ఏడాది రిలీజ్ కు ఏర్పాట్లు చేసుకుంటోంది. 

Tamil Star Suriya condolences to his die hard fan death NSK

Follow Us:
Download App:
  • android
  • ios