బోయపాటి డైరెక్షన్ తమిళ హీరో సూర్య సినిమా...? షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఏ కాంబినేషన్ లో సినిమా వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఇప్పటికే కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఇండస్ట్రీలో సందడి చేశాయి.. చేస్తున్నాయి. ఈక్రమంలో మరో క్రేజీ కాంబినేషన్ కు టాలీవుడ్ వేదిక కాబోతోంది.

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భాషతో సబంధం లేకుండా.. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మధ్య ట్రైయాంగిల్ లవ్ నడుస్తోంది. అక్కడి హీరోలు ఇక్కడ.. ఇక్కడ హీరోలు అక్కడ. డైరెక్టర్లు, నిర్మాతలు.. ఇలా నార్త్ సౌత్ కాంబినేషన్ లో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతోంది.
బాలయ్యతో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు బోయపాటి శ్రీను. టాలీవూడ్ లో ఊరమాస్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా బోయపాటి తన కెరీర్ లో ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. స్కంద టైటిల్ తో రూపొందిన ఈసినిమా ఈనెల 28న తెలుగులో పాటు ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ఇప్పుడు బోయపాటి తదుపరి సినిమాపై అంతా ఉత్కంట నెలకొంది. ఇద్దరు ముగ్గురు హీరోలు పేర్లు బోయపాటికాంబినేషన్ లో వినిపించినా.. ఎక్కువగా మాత్రం తమిళ స్టార్ హీరో సూర్య పేరు వినిపిస్తోంది.
కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో సూర్య బోయపాటి డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కోలీవుడ్ తాజా సమాచారం మేరకు బోయపాటి-సూర్య చిత్రం దాదాపుగా కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం అవనుంది. దాంతో, తెలుగు, తమిళ భాషల్లో సరికొత్త కాంబినేషన్ అభిమానులను అలరించనుంది. ఇప్పటికే తమిళ హీరోలు, తెలుగు దర్శకులు కాంబోలు సౌత్ ఆడియన్స్ ను అలరించగా.. త్వరలో ఈ డిఫరెంట్ కాబో సందడి చేయబోతోంది.
బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మాస్ మసాలా సినిమాలకు కేరాఫ్ అడ్రస్. చాక్లెట్ బాయ్ ను కూడా ఊరమాస్ హీరోగా చూపించగలడు.. ఇప్పటికే మాస్ ఇమేజ్ కావాలి అనుకుంటున్న హీరోలంతా బోయపాటి ముందు క్యూ కట్టగా.. బోయపాటిమాత్రం సూర్యతో సినిమా కోసం మెగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక సూర్య మల్టీ టాలెంటెడ్ యాక్టర్.. ఆయన ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
బోయపాటి గతంలో పలు ఇంటర్వ్యూలలో సూర్యతో కలిసి పనిచేయాలనే తన కోరికను ప్రస్తావించారు. సూర్య ప్రస్తుతం కంగువ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శివ రపొందిస్తున్నాడు. బాలీవుడ్ నటి దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 10 భాషల్లో విడుదల కానుంది.