Asianet News TeluguAsianet News Telugu

విజయ్ కు ఓటు వేయను.. తమిళ స్టార్ సీనియర్ హీరో కామెంట్స్ వైరల్..

వందల కోట్లు కలెక్ట్ చేసే సినిమాలతో సౌత్ మార్కెట్ ను గట్టిగా శాసిస్తున్న విజయ్.. రాజకీయాలంటూ బయలుదేరాడు. పార్టీని ప్రకటించాడు. ఇక ఆయన పార్టీకి ఓటు వేసేది లేదంటున్నాడు తమిళ సీనియర్ హీరో. 
 

Tamil Star Senior Hero Arvind Swamy comments about Vijay Thalapathy JmS
Author
First Published Feb 7, 2024, 11:32 AM IST | Last Updated Feb 7, 2024, 11:32 AM IST

దళపతి విజయ్.. సౌత్ లో యమా క్రేజ్ ఉన్న హీరో. ఆయన  ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంతో పాటు మన  తెలుగులో కూడా విజయ్ కు మంచి  మార్కెట్ ఉంది. విజయ్ సినిమాలు ప్రస్తుతం వరుస హిట్లు కొడుతూ.. వందల కోట్ల రూపాయిలను వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక సినిమాల విషయంలో మంచి ఫామ్ లో ఉండగానే.. రాజకీయాలంటూ బయలుదేరాడు దళపతి. తమిళనాట సినీరాజకీయం కొత్తేమి కాదు.. కాని విజయ్ లాంటి స్టార్ పార్టీ స్టార్ట్ చేయడం అంటే.. ఎలక్షన్స్ లో గట్టిగాప్రభావం ఉంటుంది. ఈక్రమంలో ఆయన 2026 ఎలక్షన్స్ ను టార్గెట్ గా చేసుకుని రాజికాయ పార్టీని స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ప్రకటించాడు విజయ్. 

గత కొన్నేళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా తన పార్టీ పేరును కూడా అనౌన్స్ చేశారు. తమిళగ వెట్రి కజగం అనే పేరును ప్రకటించారు విజయ్. ఇదిలా ఉంటే విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఆయన పొలిటికల్ ఎంట్రీపై స్పందిస్తున్నారు.  కొందరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే మరికొంతమంది మాత్రం విజయ్ సినిమాలకు దూరం అవుతారని ఫీల్ అవుతున్నారు.

Tamil Star Senior Hero Arvind Swamy comments about Vijay Thalapathy JmS

విజయ్ ప్రస్తుతం  తన సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఫాస్ట్ గా ఒక దాని వెంట మరొకటి పూర్తి చేస్తున్నాడు. తాజాగా ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో  గోట్ అనే  మూవీ చేస్తున్నాడు. అయితే విజయ్ పొలిటికల్ పార్టీ ప్రకటనతో.. ఇక ఈసినిమా తన చివరి సినిమా అయ్యి ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు. మరోక న్యూస్ ప్రకారం.. విజయ్ ఆతరువాత శంకర్ తో సినిమా చేస్తాడు అని అంటున్నారు. ఈక్రమంలో విజయ్ పొలిటికల్ పార్టీపై స్పందించారు సీనియర్ నటుడు అరవింద్ స్వామి. 

అయితే అరవింద్ స్వామి కామెంట్స్ ఇప్పటివి కావు.. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్న  నేపథ్యంలో తమిళ్ స్టార్ నటుడు అరవింద్ స్వామి చేసిన ఓల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తానకు సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే చాలా ఇష్టం, కమల్ హాసన్ అంటే కూడా చాలా అభిమానం. అలాగే దళపతి విజయ్ అంటే కూడా ఇష్టమే అన్నారు అరవింద్ స్వామి. కాని విజయ్  రాజకీయాల్లోకి వస్తారని టాక్ వస్తుంది. అలా  వస్తే మాత్రం నేను ఓటు వేయను అని అన్నారు. ఒక నటుడికి ప్రభుత్వ విధానాలు చేసే అర్హత ఉందని ఎలా నమ్ముతారు అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో నటించడం అంత ఈజీ కాదు అన్నారు అరవింద్ స్వామి. 

సినిమాలో హీరో ప్రజలను కాపాడినట్లు రాజకీయాల్లో కూడా చేయాలి అనుకోవడం కుదరని పని అన్నారు అరవింద్ స్వామి. ముందు రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. రాజకీయాలకు నేర్చుకోవడం కూడా ముఖ్యం అని అన్నారు అరవింద్ స్వామి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక పార్టీప్రకటించిన విజయ్ త్వరలో కార్యచరణ్ మొదలెట్టబోతున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ.. విజయ్ పార్టీ నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక 2026 ఎన్నికలు టార్గెట్ విజయ్ పార్టీ ముందడుగు వేయబోతున్నట్టు తెలుస్తోంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios