Asianet News TeluguAsianet News Telugu

మేకప్ కోసమే నాలుగు గంటలు, ఫ్యాన్స్ కోసం మరో ప్రయోగంతో విక్రమ్ సిద్థం

గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడంలో విక్రమ్ ముందుంటాడు. ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా తగ్గేదే లేదంటో మరో ఎక్స్ పెర్మెంట్ తో రాబోతున్నాడు చియాన్. 
 

Tamil Star Hero Vikram Experimental Movie
Author
First Published Jan 8, 2023, 11:16 AM IST

విభిన్న పాత్రలను పోషించడంలో  తమిళ స్టార్ హీరో.. చియాన్ విక్రమ్ ముందే ఉంటారు. విక్రమ్ ఏ పాత్ర చేసినా దానికి 100 పర్సంట్  న్యాయం చేస్తాడు. ఇక ఈ మధ్య తీసుకునే పాత్రలు కూడా సులువుగా ఉండేవి కాకుండా.. ఛాలెంజింగ్ క్యారెక్టర్లు తీసుకుంటున్నాడు. అయితే ఈ ప్రయోగాల ద్వారా విజయం సాధించకపోయినా.. లెక్కచేయకుండా ఆడియన్స్ కు కొత్తదనం చూపించడం కోసం పరితపిస్తున్నాడు విక్రమ్. 

సినిమా కోసం కోసం ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా .. తెరపై ఎలా కనిపించడానికైనా విక్రమ్  వెనుకాడరు. ఈక్రమంలో మరోసారి  అలాంటి ప్రయోగానికే  విక్రమ్ మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు. తమిళ సినిమాగా తెరకెక్కుతున్న  తంగాలన్ ద్వారా సందడి చేయబోతున్నాడు విక్రమ్.  

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకి, పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్వాతంత్య్రం రాకముందు జరిగిన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పట్లో 'నరాచీ' ప్రాంతంలో దళితులపై జరిగిన మారణకాండ ను కథగా చేసుకుని ఈ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో  డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు విక్రమ్. ఈ పాత్ర కూడా రాటుదేలిన గిరిజప వ్యక్తిగా విక్రమ్ కనిపించబోతుననాడు.  పొడవైన గుబురు గెడ్డం.. గోచీతో.. కాస్త కొత్గగా కనిపిస్తున్నాడు.చేతిలో కర్ర .. చెవికి పోగులు.. కడియంతో అచ్చం గిరిజన వ్యాక్తిలా మారిపోయాడు. ఈ పాత్రకోసం చాలా కష్టపడ్డాడట విక్రమ్. నటన విషయంలో ఆయనకు తిరుగులేదు. అలాగే ఈ పాత్రకు సబంధించిన  మేకప్ కోసం కూడా ఆయనికి 4 గంటలకు పైగా టైమ్ పట్టేదంటున్నాడు మూవీ టీమ్. 

ఒక సినిమాలో పాత్ర కోసం స్టార్ హీరో అంత టైమ్ కేటాయించడం.. అది కూడా మేకప్ కోసం విక్రమ్ అంత సేపు ఓపికగా కూర్చోవటం.. పాత్ర పట్ల విక్రమ్ కు ఉన్న డెడికేషన్ కు..  ఆయన సహనానికి నిదర్శనమని అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఇక ఈ సినిమాలో విక్రమ్ జతగా.. పార్వతీ మీనన్.. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios