ఏజ్ పెరుగుతున్న కొద్ది ఫిట్ నెస్ కూడా పెంచుకుంటూ పోతున్నాడు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్. సినిమాల విషయంలో ప్రయోగాలు చేస్తూ.. దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో.. తాజాగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
చియాన్ విక్రమ్.. కుర్రకారుకు పోటీ ఇస్తోన్న ఈ సీనియర్ స్టార్ హీరో.. 60 ఏళ్లకు అతి దగ్గరలో ఉన్నాడు. అయినా సరే ఫిట్ నెస్ కాని.. హ్యాండ్సమ్ నెస్ కాని.. యాక్టింగ్ కాని.. ఏ విషయంలో కూడా కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. గెలుపోటములకు సంబంధం లేకుండా.. వరుస సినిమాలు లైన్ అప్ చేసుకుంటూ.. రెచ్చిపోతున్నాడు విక్రమ్. ఇక తాజాగా ఆయన నటించిన మరో ప్రయోగాత్మక సినిమా తంగలాన్. ఈసినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ మధ్యే పొన్నియన్ సెల్వన్ రెండు సినిమాలతో చరిత్ర సృష్టించాడు విక్రమ్. భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ . ఇందులో ఆదిత్య కరికాలన్ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న తాజా సినిమా తంగలాన్ . ఈ చిత్రానికి కబాలి , కాలా , సారాపట్టా పరంబరై లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసిన పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక తాజాగా తంగలాన్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇక ఈ ప్రయోగాత్మక సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన సందర్భంగా షూటింగ్ స్పాట్ నుంచి హీరో విక్రమ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘అద్భుతమైన వ్యక్తులతో పని చేశా, చాలా అద్భుతమైన అనుభవాలను పొందాను. షూటింగ్ స్టార్ట్ అయిన మొదటి ఫోటో ... చివరి రోజు దిగిన చివరి ఫోటో.. మధ్య కేవలం 118 రోజులు మాత్రమే ఉన్నాయా.. మమ్మల్ని ఈ డ్రీమ్‌లో జీవించేలా చేసినందుకు రంజిత్‌కి చాలా థ్యాంక్స్ అని విక్రమ్ ట్వీట్ చేశారు.
ప్రస్తుంత విక్రమ్ ట్విట్ వైరల్ అవుతుంది. చియాన్ ఫ్యాన్స్ ఆ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు. ఇక తమిళ హిస్టారికల్ అడ్వెంచర్ డ్రామా గా తెరకెక్కుతోన్న ఈసినిమాలో విక్రమ్ జోడీగా మాళవికా మోహనన్ తో పాటు.. పార్వతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ హిందీ, మలయాళం భాషల్లో కూడా ఈసినిమా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, నీలం ప్రొడక్షన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, పా.రంజిత్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
