Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దళపతి ఏంటి ఇలా అయిపోయాడు..? న్యూ లుక్ లో స్టార్ హీరో..

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతిని చూశారా.. ఇదేందిది ఇలా అయ్యాడు. యంగ్ లుక్ అని ఫ్యాన్స్ అంటున్నారు.. కాని ఇలా ఉన్నాడేంటని అందరూ అంటున్నారు. 
 

Tamil Star Hero Vijay Thalapathy New Look Viral In Social Media JMS
Author
First Published Jan 11, 2024, 1:20 PM IST

కంప్లీట్ గాలుక్ మార్చేశాడు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్. చాలా కాలంగా అయితే గుబురు గెడ్డం లేకుంటే.. చిరు గెడ్డంతో కనిపించిన స్టార్ హీరో.. ప్రస్తుతం అసలు గుర్తు పట్టకుండా అయిపోయాడు విజయ్. రీసెంట్ గా తమిళ స్టార్ సీనియర్ హీరో విజయ్ కాంత్ కు నివాళి అర్పించడానికి వచ్చిన విజయ్ షాకింగ్ లుక్ ను ప్రజలు పెద్దగా గమనించలేదు. కాని తాజాగా ఆయన అభిమానులతో ఓ సెల్ఫీ దిగాడు. ఈ సెల్ఫీలో విజయ్ లుక్ చూసి ఆశ్చర్చపోతున్నారుజనాలు. 

విజయ్ దళపతి తన  68వ సినిమాగా  గోట్ లోనటిస్తున్నాడు. ఈమూవీని  వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో విజయ్ జోడీగా మీనాక్షి  నటించింది. వీరితో పాటు ఈమూవీలో  స్నేహ, లైలా, ప్రేమ్‌జీ, ప్రశాంత్, ప్రభుదేవా, నితిన్ సత్య, వైభవ్, జయరామ్, మైక్ మోహన్ తదితరులు నటిస్తున్నారు. విజయయ సినిమాకు  యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ గతేడాది అక్టోబర్‌లో చెన్నైలో ప్రారంభమైంది. ముందుగా విజయ్, ప్రభుదేవా, ప్రశాంత్ డ్యాన్స్ చేసే ఓ పాట సన్నివేశాన్ని చిత్రీకరించారు. అక్కడ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మూవీ టీమ్ థాయ్‌లాండ్‌కు వెళ్లి అక్కడ యాక్షన్ సీన్స్ ను కంప్లీట్ చేసుకుని వచ్చారు. వచ్చీ రావడంతోనే ఈ టీమ్.. నెక్ట్స్ షెడ్యూల్ ను  హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. ఇకక్కడ కూడా కీలక సన్నివేశాలు షూట్ చేశారు. హైదరాబాద్ లో మూడో షెడ్యూల్ ను కంటీన్యూ చేస్తున్నారు టీమ్. 

ప్రస్తుతం, న్యూ ఇయర్ సెలవుల తర్వాత  షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ కోసం విజయ్ మీసాలు, గడ్డం క్లీన్ గా మార్చుకుని యంగ్ లుక్ లోకి మారిపోయాడు. అస్సలు గుర్తు పట్టకుండా అయిపోయాడు. మొన్నటి దాకా గెడ్డం ఉంది.. ఇప్పుడు ఏందుకు ఇలా అయిపోయాడు అని అందరికి డౌట్ వస్తుంది. అయితే దానికి అసలు కారణం ఉంటంటేు..  విజయ్ ఈసినిమాలో  ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 

అయితే ముందుగా ఒక గెటప్ కు సబంధించిన సీన్స్ అన్నీ షూట్ చేశారట. అందులో గెడ్డంతో ఉంటాడట విజయ్.. ఇక ఇప్పటి నుంచి విజయ్ యంగ్ లుక్ కు సబంధించిన షూటింగ్ చేయబోతున్నారట. అందుకే దర్శకుడు వెంకట్ ప్రభు విజయ్ లుక్ ను కంప్లీట్ గా మార్చేసినట్టు తెలుస్తోంది. 

ఇక ఈమూవీ సెట్స్ లో ఉన్న విజయ ను  విజయ్‌ని చూసేందుకు అభిమానులు రోజూ ఎగబడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కారు దిగి తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు చేయి ఊపిన విజయ్, ఈరోజు షూటింగ్ ముగించుకుని తనను చూసేందుకు గుమిగూడిన అభిమానులతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. యంగ్ లుక్‌లో అభిమానులతో విజయ్ తీసుకున్న సెల్ఫీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios