స్టార్ హీరో సూర్య ఇండియాన్ మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ను మీట్ అయ్యారు. క్రికెడ్ దేవుడిగా ప్రపంచం కీర్తించిన దిగ్గజ ప్లేయర్ తో సూర్య పోటో వైరల్ అవుతోంది. 

ఈమధ్య ఫిల్మ్ స్టార్స్.. కు స్టార్ క్రికెటర్స్ కు మధ్య అనుబంధం పెరుగుతూ వస్తోంది. గతంలో నుంచే ఇది ఉండగా.. ఇప్పుడు అది మరింతగా పెరుగుతుంది. గతంలో బాలీవుడ్ కు.. ఇండియర్ క్రికెటర్స్ కు మధ్య స్నేహం బాగా ఉండేది. రాను రాను సౌత్ నుంచి నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో క్రికెటర్ల అనుబంధం పెరుగుతూ వస్తోంది. ఈక్రమంలో ఇప్పటి యంగ్ స్టార్స్ కూడా క్రియెటర్స్ తో మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఆమధ్య ఇండియన్ టీమ్ కు రామ్ చరణ్ తన ఇంట్లోవింధు కూడా ఇచ్చారు. 

ఈక్రమంలో రీసెంట్ గా దిగ్గజ క్రికెట్ ప్లేయర్ సచిన్ ని స్టార్ హీరో సూర్య కలిశారు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈఫోటో చూసిన సూర్య ఫ్యాన్స్ నెట్టింట ఇంకా వైరల్ చేస్తున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. టీమిండియా పేరు చెప్పగానే సచిన్ ఎలా గుర్తొస్తాడో, తమిళ సినిమాలు అంటే హీరో సూర్యు కళ్ళముందు కదులతాడు. అటు తమిళ ఆడియన్స్ తో పాటు డబ్బింగ్ సినిమాలో తెలుగు ఆడియన్స్ ను కూడా దాదాపు 20 ఏళ్ల నుంచి అలరిస్తున్నాడు సూర్య. 

View post on Instagram

అటు ఇండియన్ క్రికెట్ లవర్స్ తో పాటు.. ప్రపంచ క్రీడాభిమానులను దాదాపు 25 ఏళ్లు తన ఆటతీరుతో .. మెప్పించి క్రికెట్ దేవుడు అనిపించుకున్నాడు సచిన్ టెండుల్కర్.. అలాంటి సచిన్ తో సూర్య ఫొటో దిగేసరికి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. లైక్స్, కామెంట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కాని ఈ ఫోటోకు సబంధించి వివరాలు మాత్రం తెలియలేదు. సూర్య సచిన్ తో ఎప్పుడు ఎక్కడ ఫొటో దిగారనేది మాత్రం తెలియలేదు. 

ఈ ఫోటోను సూర్య తన సోషల్ మీడియాలో శేర్ చేస్తూ.. రెస్పాక్ట్ & లవ్ అని క్యాప్షన్ మాత్రమే పెట్టాడు. కారణం పక్కనబెడితే.. ఇలా ఇద్దరు స్టార్స్ కలిసి కనిపించేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఇదిలా ఉండగా రీసెంట్ గా సచిన్, హైదరాబాద్ లో జరిగిన రేసింగ్ చూసేందుకు వచ్చాడు. మరోవైపు సూర్య, తన 42వ సినిమాతో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.