తమిళ స్టార్ ధనుష్ - శేఖర్ కమ్ముల సినిమా షురూ.. ఒకేసారి మూడు భాషల్లో షూటింగ్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!
తమిళ హీరో ధనుష్ (Dhanush) - శేఖర్ కమ్ముల కాంబినేషన్ సెట్ అయ్యింది. ఈరోజు పూజా కార్యక్రమాలతో మూవీని ప్రారంభించారు. సినిమాకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఏ పాత్రలోనైనా అప్రయత్నంగా రాణించే నటులలో కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ ఒకరు. బహుముఖ ప్రజ్ఞ మరియు నటనా నైపుణ్యం కారణంగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నారు. దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా చేరిపోయారు. ఇటీవల ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు తీసుకున్నాక ధనుష్ కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు చిత్రాలు రిలీజ్ కాగా... మరో మూడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిలో డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ‘సార్’ (SiR) కూడా ఒకటి.
తాజాగా తెలుగులోనే మరోచిత్రాన్ని కూడా పట్టాలెక్కించబోతున్నారు ధనుష్. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ అరుదైన కాంబినేషన్‌తో పాత్ బ్రేకింగ్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లోని క్రేజీయస్ట్ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకోనుంది. నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్) సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
సోనాలి నారంగ్ సమర్పణలో ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. వివిధ భాషలకు చెందిన అగ్రశ్రేణి సాంకేతిక బృందంతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. త్వరలో చిత్ర యూనిట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. తెలుగులోనూ ధనుష్ మంచి డిమాండ్ ఉండటంతో బ్యాక్ టుు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు.
తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ధనుష్ నటిస్తున్న తొలిచిత్రం ‘సార్’. తమిళంలో ‘వాతి’గా రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళంలో బైలింగ్వల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్ సంస్థలు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాయి. ధనుష్ కేరీర్ లోనే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు సమాచారం. హీరోయిన్ గా సంయుక్తా మీనన్ (Samyuktha Menon) నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.