ప్రియుడికోసం కట్టుకున్న భర్తనే చంపడానికి ప్రయత్నం చేసింది తమిళ బుల్లితెర నటి. దానికోసం సినిమా రేంజ్ లో స్క్రిప్ట్ కూడా రాసకుంది. మరి చివరకు ఏమైందంటే..?  

తమిళ సీరియల్ నటి రమ్య తన భర్తనే చంపాలని ప్రయత్నించింది. ప్రియుడి మొజులో పడ్డ ఆమె.. అతనితో కలిసి కట్టుకున్న భర్తనే చంపాలనుకుంది. పోలీసుల విచారణలో రమ్యకుట్ర బయటపడటంతో.. ప్రియుడితో కలిసి జైలు పాలు అయ్యింది బుల్లితెర బ్యూటీ. ఇక పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం. తమిళనాడులోని నల్లగౌండన్కు చెందిన నటి రమ్య దంపతులిద్దరు కలిసి బండిపై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి .. వీరిని తన బైక్ తో ఢీ కొట్టాడు. వీరు కిందపడిన వెంటనే.. ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న బ్లేడ్ తో రమేష్ గోందు కోసి పరారాయ్యాడు. తీవ్ర గాయంతో రక్త స్రావం అవుతున్న రమేష్ ను హాస్పిటల్ కు తీసుకువెల్లగా..అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. 

ఈ ఘటనపై రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తనతో పాటుతన భార్య రమ్యను కూడా విచారించారు పోలీసులు. అయితే ఈ విచారణలో రమ్య పొంతన లేని సమాదాణాలు చెప్పండంతో అనుమానం పెరిగి రమ్యను గట్టిగా నలిదీయడంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. తనే భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్లు ఆమెఓప్పుకోక తప్పలేదు. రమ్య తమిళ బుల్లితెర నటి. ఆమె సుందరి', కన్నేదిరే తొండ్రినాల్ లాంటి సీరియల్స్లో నటించి పాపులారిటీ సాధించింది. 

అయితే సీరియల్ నటి రమ్య ఆమె భర్త రమేష్ ల మధ్య కొంతకాలంగా సఖ్యత లేదు. చిన్నచిన్న విషయాలకు వారిమధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అయితే రమ్య సీరియల్స్ లో నటిస్తూ.. బిజీగా ఉండటం.. ఆమె అలా నటించడం తనకు ఇష్టం లేదని రమేష్ తరచు గొడవలు పడేవాడని విచారణలో తేలింది. అయితే రమేష్ ఎంత చెప్పినా.. రమ్య అతడి మాట వినిపించుకోలేదు. ఈ క్రమంలో వీరి మధ్య తగాదాలు పెరిగీ తరచూ గొడవలు కావడంతో.. ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. 

అదే సమయంలో రమ్య తన సహనటుడు డేనియల్ అలియాస్ చంద్రశేఖర్ తో సన్నిహితంగా మెలగసాగింది. అతడితో కలిసి తన భర్తను చంపాలని ప్లాన్ చేసింది. అటు చంద్రశేఖర్ కూడా ఇల్లు కోనాలన్న నెపంతో రమేష్ తో.. వైరం పెంచుకున్నాడు. దాంతో రమ్యతో కలిసి చంద్రశేఖర్ కూడా రమేష్ ను చంపాలని ప్లాన్ చేశారు. చివరకు ఇద్దరు దొరికిపోయారు. ఇద్దరు నిందుతులను కోయంబత్తూర్ సెంట్రల్ జైలుకు పంపించారు.