రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో `రెయిన్‌బో` చిత్రాన్ని నేడు ప్రారంభించారు. కానీ ఈ సినిమాని మొదట సమంతతో ప్రకటించారు. కానీ సామ్ స్థానంలో రష్మిక రావడం, సమంత తప్పుకోవడంపై నిర్మాత స్పందించారు.
సమంత రెండేళ్ల క్రితం `డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్` పతాకంపై ఓ బైలింగ్వల్ చిత్రం ప్రకటించారు. దానికి సంబంధించిన అప్‌డేట్ ఇప్పటి వరకు లేదు. కానీ అనూహ్యంగా సమంత స్థానంలో రష్మిక మందన్నా వచ్చి చేరింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న ఇందులో దేవ్ మోహన్ రష్మికకి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నేడు(సోమవారం) అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.
దీనికి `రెయిన్‌బో` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఫిక్షనల్ లవ్ డ్రామాగా ఈ సినిమాని రూపొందిస్తున్నారట. ఇందులో అనేక కొత్త అంశాలు, చాలా థ్రిల్లింగ్ పాయింట్లు ఉన్నాయట. తాజాగా రష్మిక మందన్నా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే సమంత స్థానంలో రష్మిక రావడం పట్ల సర్వత్ర ఆసక్తి పెరిగింది. ఏం జరిగిందనే ఉత్సుకత అందరిలోనూ నెలకొంది. తాజాగా ఇదే ప్రశ్న `రెయిన్‌బో` నిర్మాత ఎస్‌ఆర్ ప్రభుని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఆశ్చర్యకరంగా, షాకింగ్‌గా ఉండటం విశేషం. పరోక్షంగా సమంతపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
దీనిపై ఎస్‌ఆర్ ప్రభు స్పందిస్తూ, మంచి స్క్రిట్లు, క్రియేటర్స్ రైట్ ప్లేస్‌లో రైట్ పర్సన్‌ని ఎంపిక చేసుకుంటాయి. మేం అదే నమ్ముతాం. ఆ ఫ్లోని మేం మార్చాలనుకోవడం లేదు. కంటెంట్, కర్మ అలా జరుగుతూ వెళ్తుంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు` అని వెల్లడించారు. ఇదే ఇప్పుడు సమంత ఫ్యాన్స్ ని హార్ట్ అయ్యేలా చేసింది. సమంత హీరోయిన్‌గానే ఈ నిర్మాతలు రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు సరైన స్థానంలో సరైన పర్సన్ ఎంపిక చేయబడతారని తెలిపారు. అంటే సమంత ఈ స్క్రిప్ట్ కి రైట్ పర్సన్ కాదా? నిర్మాత దృష్టిలో సమంత దీనికి కరెక్ట్ కాదా? అని ప్రశ్నిస్తున్నారు సమంత ఫ్యాన్స్.
అంతేకాదు కర్మ వల్ల అవి జరుగుతుంటాయని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత నవ్వుతూ చెప్పినా, ఆయన వాడిన పదజాలం మాత్రం ఘాటుగానే, తీవ్రమైన పదాలే వాడటంతో ఎస్‌ఆర్ ప్రభు వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. అయితే సమంత ఈ ప్రాజెక్ట్ చేసినప్పటికే నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. కొన్నాళ్లపాటు సమంత కోసం టీమ్ వెయిట్ చేసిందట. అనంతరం రష్మికతో కమిట్ అయ్యారని ఓ వెర్షన్ వినిపిస్తుంటే, ఇప్పుడు సమంతకి మూడేళ్ల వరకు డేట్స్ లేవట. దీంతో రష్మికని తీసుకున్నారని మరో వెర్షన్ వినిపిస్తుంది. ఈ రెండు పక్కన పెడితే, సమంత ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించబడిందా? అనే కామెంట్లు కూడా టాలీవుడ్‌లో వినిపిస్తుండటం గమనార్హం. ఏదేమైనా ఇప్పుడిది కాస్తా చర్చనీయాంశంగానే మారిందని చెప్పొచ్చు. ఇక రష్మిక మందన్నా నటిస్తున్న తొలి లేడీఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం.
సమంత ప్రస్తుతం `శాకుంతలం` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండతో `ఖుషి` సినిమా చేస్తుంది. ఇంకోవైపు హిందీలో `సిటాడెల్` రీమేక్ వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే హిందీలో ఆయుష్మాన్ ఖురానాతో ఓ సినిమా చేయాల్సిందే. మరోవైపు ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉంది. రష్మిక మందన్నా `పుష్ప2`, `యానిమల్`తోపాటు ఇటీవలే నితిన్ సినిమా ప్రారంభమైంది. ఇప్పుడు `రెయిన్‌బో`ని ప్రారంభించింది.
