వరుస విషాదాలతో ఫిల్మ్ ఇండస్ట్రీ కోలుకోకుండా అవుతుంది. రోపై ఏదో ఒక భాషలో.. సినిమా సెలబ్రిటీలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఇక తాజాగా తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వ్యాధితో కన్నుమూశారు.
వరుస విషాదాలతో ఫిల్మ్ ఇండస్ట్రీ కోలుకోకుండా అవుతుంది. రోపై ఏదో ఒక భాషలో.. సినిమా సెలబ్రిటీలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఇక తాజాగా తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వ్యాధితో కన్నుమూశారు.
తమిళ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ సంగీత దర్శకుడు రఘురామ్ కన్నుమూశాడు. పచ్చ కామెర్ల వ్యాధితో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మరణవార్త తెలిసి కోలీవుడ్ షాక్ కు గురయ్యింది. విషయం తెలిసిన తమిళ సినీ సెలబ్రిటీలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు రఘురామ్ మృతికి సంతాపం తెలుపుతున్నారు
రీసెంట్ గానే పచ్చ కామెర్ల బారిన పడిన రఘురామ్ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అయితే చాలా తక్కువ టైమ్ లో.. చాలా ఫాస్ట్ గా జాండిస్ వ్యాధి వ్యాపించింది. ట్రీట్మెంట్ అందిస్తున్న టైమ్ లోనే ముదిరిపోయింది. శరీరమంతా పాకింది. దాంతో అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఈ పరిస్థితుల్లో మెరుగైన ట్రీట్మెంట్ కోసం రఘురామ్ ను చెన్నైలోని ఓ పెద్ద హాస్పిటల్ కు తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటున్న రఘురామ్ శనివారం తుదిశ్వాస విడిచాడు. రఘరామ్ ప్రాణాలు కాపాడటానికి చాలా ప్రయత్నంచేశారు డాక్టర్లు అయినా లాభం లేకుండా పోయింది.
ఇక 2017లో వచ్చిన ఒరు కిడియాన్ కరుణై మను సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం ప్రారంభించాడు రఘురామ్. ఈ సినిమాతో ప్రేక్షకుల మరసు దోచాడు. ముఖ్యంగా రఘురామ్ సినిమాలకు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేది. దాంతో అతనికి అవకాశాలు వరసకట్టాయి. ఈ సినిమా తరువాత రివైండ్ సినిమాకు సంగీతం అందించాడు రఘరామ్. ప్రస్తుతం సాథియా సొథనై అనే సినిమాకు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి కామెర్లు వచ్చాయి. ఇక రఘురామ్ ఇలా హాఠాత్తుగా చనిపోవడంతో ఈ విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నాు.
