Asianet News TeluguAsianet News Telugu

Vishal : మీరు ఇంట్లో సేఫ్ గా ఉన్నారుగా..? చెన్నై మేయర్ పై ఘాటుగాసెటైర్లు వేసిన హీరో విశాల్..

తమిళ స్టార్ హీరో విశాల్ ఓ పోస్ట్ పెట్టారు. మా ఇంట్లో కరెంట్ లేదు.. మీరు సేఫ్ గానే ఉన్నారు కదా.. మీరు హ్యాపీగానే ఉన్నారు కదా..చెన్నై నగరంమునిగిపోతోంది చూస్తున్నారా అంటూ సెటైర్లు వేశారు. ఇంతకీ విశాల్ ఎందుకీ పోస్ట్ పెట్టారు.  

Tamil Hero Vishal Setairical Post about Chennai Mayor JMS
Author
First Published Dec 5, 2023, 1:04 PM IST

ప్రస్తుతం తమిళ,ఆంధ్రా ప్రాంతాలను మిచౌంగ్  తుపాను ముంచెత్తుతోంది. తుఫాను కారణంగా.. చెన్నై స్తంభించిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. బాధిత ప్రజలు ఆహారం, నీటి కోసం అలమటిస్తున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగినా.. ఇలాంటి విపత్తులను ఎదుర్కొవడంలో పాలకులు విఫలం అవుతూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో వారిపై సెటైర్లు పడుతున్నాయి. చాలా మంది డైరెక్ట్ గానే ఘాటు విమర్షలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో నగర మేయర్ పై ప్రమఖ తమిళ హీరో  విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెటైరికల్ గా పోస్ట్ పెట్టారు. 

ప్రభాస్, మహేష్, చిరు,చరణ్, ఎన్టీఆర్, బన్నీ, బాలయ్య టాలీవుడ్ హీరోల‌ు ఏం చదువుకున్నారో తెలుసా..?

 2015లో కురిసిన భారీ వర్షాలకు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ..అప్పటి పరిస్థితికి.. ఇప్పటి పరిస్థితికిపోలిక పెడుతూ.. విశాల్ ఘాటుగా విమర్షలు చేశాడు. అప్పుడు చెన్నై నగరం ఒక నెలపాటు స్తంభించిపోయిందని... అది జరిగి ఏళ్లు గడిచిపోయినా నగర పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని విశాల్ విమర్శించారు. ఇంతకీ ఆయన  ఏమన్నారంటే.. 'డియర్ ప్రియా రాజన్ (చెన్నై మేయర్), గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్, ఇతర అధికారులకు.. మీ నివాసాల్లోకి వరద నీరు రావడం లేదని అనుకుంటున్నా. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలో హ్యపీగా సేఫ్ గా  భావిస్తున్నా. మీ ఇళ్లకు కరెంట్, ఆహారం ఎలాంటి లోటు లేకుండా అందుతోందని భావిస్తున్నా. అయితే, సిటీలో మీతో పాటు నివసిస్తున్న ఇతర ప్రజలు మాత్రం మీ మాదిరి సురక్షితంగా లేరు. మీరు చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రెయిన్ ప్రాజెక్ట్ సింగపూర్ కోసమా లేక చెన్నై కోసమా? అని అన్నారు. 

 

అంతే కాదు 2015లో భారీ వర్షాల కారణంగా విపత్తు వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరు  రోడ్ల మీదకు వచ్చి ప్రజలకు సాయం అందించాం. అది జరిగిన 8 ఏళ్ల తర్వాత పరిస్థితి మరింత ఘోరంగా తయారయింది. ఈ సారి కూడా బాధితులకు మేమంతా ఆహారం, నీటిని పంపిణీ చేసి వారిని ఆదుకుంటాం. అయితే, ఈ సారి ప్రజా ప్రతినిధులంతా వారివారి నియోజకవర్గాల్లో బయటకు వచ్చి బాధితులకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నా. బాధిత ప్రజల్లో భయం, ఆందోళనను కాకుండా... విశ్వాసాన్ని నింపాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. ప్రస్తుతం విశాల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios