MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్, మహేష్, చిరు,చరణ్, ఎన్టీఆర్, బన్నీ, బాలయ్య టాలీవుడ్ హీరోల‌ు ఏం చదువుకున్నారో తెలుసా..?

ప్రభాస్, మహేష్, చిరు,చరణ్, ఎన్టీఆర్, బన్నీ, బాలయ్య టాలీవుడ్ హీరోల‌ు ఏం చదువుకున్నారో తెలుసా..?

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సూపర్ స్టార్లు ఉన్నారు. అయితే అందులో చాలామంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. సంగంలోనే చదువు మానేసిన వారు కూడా ఉన్నారు. మన మన హీరోలలో సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకూ ఏం చదువుకున్నారు..క్వాలిఫికేషన్ ఎంటో తెలుసుకుందాం..?

Mahesh Jujjuri | Published : Dec 05 2023, 12:19 PM
4 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
116
Asianet Image

టాలీవుడ్‌లో హీరోలు చాలా మంది మంచి చదువులు చదివారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి వచ్చారు. మరికొందరు మాత్రం చదువును మధ్యలోనే ఆపేసి.. హీరోలుగా మారిపోయారు. వారసత్వం పునికి పుచ్చుకుని చదువు కూడా పూర్తి కాకుండానే సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు స్టార్స్ అయ్యారు.వెంకటేష్, నాగార్జున, రామ్ చరణ్ లాంటిస్టార్లు  మాత్రం ఏకంగా ఫారెన్‌లో చదువుకుని వచ్చి ఇక్కడ హీరోలుగా సెటిల్ అయిపోయారు. 
 

216
Asianet Image

టాలీవుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ చిరంజీవి కొణిదెల గ్రాడ్యూయోషన్ పూర్తి చేశారు.  డిగ్రీ లో  కామర్స్ చేసిన చిరు..నర్సాపూర్ YN కాలేజ్ లో తన ఎడ్యూకేసన్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్నారు. 

316
Asianet Image

ఇక సీనియర్ హీరోలలో ఫారెన్ వెళ్ళి మరీ చదువుకున్నవారిలో అక్కినేని నాగార్జున ఒకరు.  నాగార్జున అక్కినేని ఆటోమొబైల్ ఇంజనీరింగ్  ను పూర్తి చేశారు. ఈయన అమెరికాలోని  ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీ లో ఉన్నత చదువులు కంప్లీట్ చేసి.. ఆ తర్వాత విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
 

416
Asianet Image

విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన  మరో సీనియర్ హీరో.. వెంకటేష్. వెంకటేష్ దగ్గుబాటి  MBA పూర్తి చేశారు.  మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్  ను అమెరికాలోని మోంటేరే ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో కంప్లీట్ చేశారు.  ఆతరువాత అనుకోకుండా  కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యారు. 
 

516
Asianet Image

ఇక నందమూరి నట సింహం.. ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ కూడా గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేశారు. నిజాం కాలేజ్ హైదరాబాద్ లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి..హీరోగా ఇండస్ట్రీని ఏలారు.

616
Asianet Image

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి తరువాత వచ్చిన హీరో  పవన్ కళ్యాణ్. చిరంజీవి కంటే ఎక్కువ అభిమానులు సంపాదించుకున్న పవర్ స్టార్.. చదువులో మాత్రం కాస్త వెనకడుగు వేశారు.  ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఆపేశారు. అంజనా ప్రొడక్షన్స్‌లో సహా నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత నటుడిగా మారి పవర్ స్టార్ రేంజ్‌కు ఎదిగారు.
 

716
Mahesh Babu

Mahesh Babu

ఇక  కృష్ణ నట వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీకి బాలనటుడిగా వచ్చాడు మహేష్ బాబు. అయితే ఆయన చెన్నై లయోలా కాలేజిలో  హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు.  మహేష్ బాబు చదవు మొత్తం చెన్నై వేదికగా జరిగింది. ఆతరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే సూపర్ స్టార్ కు  తెలుగులో చదవడం రాదు.
 

816
Asianet Image

 బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  బి టెక్ పూర్తి చేసిన తర్వాత .. ఈశ్వర్ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరగా ఇండియన్ సినిమాను ఏలుతున్నాడు. టాలీవుడ్ నుంచి మొదటి ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు.
 

916
Asianet Image

ఇక ఫారెన్ లో ఉన్నత చదువులు చదివిన ఈతరం హీరోలలో  రామ్ చరణ్ ముందున్నాడు. చెన్నైల స్కూలింగ్ చేసిన రామ్ చరణ్.. లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో డిగ్రీ పూర్తి చేసాడు. ఆ తర్వాత చిరుత సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు. 

1016
Asianet Image

ఇక  అల్లు అర్జున్ గురించి ఆయన సినిమాల గురించి, నటన,డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని ఆయన ఏం చదివారు అనేది చాలా మందికి తెలియదు బన్నీ బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్  ను కంప్లీట్ చేశారు. ఇక్కడే హైదరాబాద్ లో గల ఎమ్మెస్ఆర్ కాలేజ్ లో చదివారు అల్లు అర్జున్.  ఆ తర్వా త సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు.

1116
Asianet Image

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. అయితే తారక్ పెద్ద చదువులు చదువుకోలేదు. ఆయన  ఇంటర్మీడియట్ ను సెయింట్ మేరీస్ కాలేజ్ హైదరాబాద్ లో పూర్తి చేశారు. చదువుకుంటున్న టైమ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు తారక్. దాంతో ఆయన చదువు అటకెక్కింది. ఎన్టీఆర్ మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయాడు.

1216
Asianet Image

కెరీర్ లో చాలా కష్టపడి పైకి వచ్చినవారిలో మాస్ మహారాజ  రవితేజ కూడా ఒకరు. ఆయన విజయవాడ సిద్దార్ధ కాలేజ్ లో .. బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్  పూర్తి చేసిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా..  ఇండస్ట్రీ లోకి వచ్చారు.. చిన్న చిన్న పాత్రల్లో నటించి.. కాస్త లేట్ గా స్టార్ హీరో అయ్యాడు. ఇప్పటికే తన సినిమాలతో ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు. 

1316
Asianet Image

ఇక టాలీవుడ్ నేచురల్స్టార్ నాని డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్  లోని వేస్లీ డిగ్రీ కాలేజ్ లో నాని చదువకున్నారు. ముందుగా దర్శకుడు అవ్వాలని కలలు కన్న నాని..తర్వాత బాపు, రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసి.. సడెన్ గా అష్టా చెమ్మా సినిమాతో నటుడిగా పరిచయ్యాడు.
 

1416
Asianet Image

ఇక మరో యంగ్ హీరో నితిన్ కూడా  బి టెక్ పూర్తి చేశాడు. చదువుకుంటున్న రోజుల్లోనే నితిన్  తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
 

1516
Actor Vijay Devarakonda

Actor Vijay Devarakonda

ఇక రౌడీ హీరో  విజయ్ దేవరకొండ గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. హైదరాబాద్ లోనే బి కామ్ పూర్తి చేసాడు. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి.. పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు విజయ్.   ‘పెళ్లి చూపులు హీరోగా విజయ్ ను నిలబెట్టింది.. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 

1616
Asianet Image

శర్వానంద్ బి కామ్ (వేస్లీ డిగ్రీ కాలేజ్) పూర్తి చేసాడు. రామ్ చరణ్ క్లాస్ మేట్ కావడంతోఆ పరిచయంతో థమ్స్‌అప్ యాడ్‌లో చిరంజీవితో నటించే అవకాశం కొట్టేసాడు. ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతో నటుడిగా పరిచయమై హీరో రేంజ్‌కు ఎదిగాడు.రామ్ పోతినేని: డిగ్రీ పూర్తి చేసాడు. అందులో ఏం చేసాడనేది తెలియదు. బాలయ్య, ఎన్టీఆర్ జూనియర్ తర్వాత అతి తక్కువ వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇలా ఇంకా చాలా మంది హీరోత చదువుకున్నవారు టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
నాని (నటుడు)
ప్రభాస్
 
Recommended Stories
Top Stories