Hero Prashanth Second Marriage: రెండో పెళ్లికి రెడీ అయిన జీన్స్ హీరో, 15 ఏళ్ళుగా ఒంటరి జీవితం

ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు.. పెటాకులు కామన్. రెండు.. మూడు పెళ్ళిళ్ళిల్లు కూడా ఇంకా కామన్. ఇక త్వరలో రెండో పెళ్ళికి రెడీ అవుతున్నాడు కోలీవుడ్ సీనియర్ హీరో ప్రశాంత్. 

Tamil Hero Prashanth Second Marriage

ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు.. పెటాకులు కామన్. రెండు.. మూడు పెళ్ళిళ్ళిల్లు కూడా ఇంకా కామన్. ఇక త్వరలో రెండో పెళ్ళికి రెడీ అవుతున్నాడు కోలీవుడ్ సీనియర్ హీరో ప్రశాంత్. 

కోలీవుడ్ స్టార్ సీనియర్  హీరో ప్రశాంత్ కు తమిళ్ లో పాటు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నిర్మాత త్యాగరాజన్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చిన  ప్రశాంత్ చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ముఖ్యంగా ఆయన శంకర్ డైరెక్షన్ లో డ్యూయల్ రోల్ చేసిన జీన్స్ సినిమాను ఇప్పటికీ మర్చిపోలేము. ఈసినిమాతో ప్రశాంత్ కెరీర్ సక్సెస్  ఫల్ లాంగ్ టర్న్ తీసుకుంది. ఇఖ  ఆతరువాత కెరీర్ పై ఇంట్రెస్ట్ తో పాటు సినిమాలు కూడా తగ్గిపోవడంతో చాలా కాలం స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు ప్రశాంత్. 

 రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తిన   ప్రశాంత్. తెలుగులో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో  కీలక పాత్రలో కనిపించాడు. ఇలా ఇంపార్టెంట్ రోల్స్ చేయడానికి వెనకాడటం లేదు ప్రశాంత్. మంచి అవకాశాల కోసం చూస్తున్నాడు. టు తెలుగులో కూడా ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నాడు ప్రశాంత్. 

ఇక ఈ మధ్య  ప్రశాంత్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు కోలీవుడ్ కోడై కూస్తోంది. ప్రశాంత్ 2005లో వ్యాపారవేత్త కుమార్తె గృహలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుక కూడా ఉన్నాడు. పెళ్లైన మూడేళ్లకే వీరిద్దరికీ మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో 2008లో విడాకులు తీసుకున్నారు. 

అప్పటి నుంచి ప్రశాంత్ దాదాపు 14 ఏళ్లకు పైగా  ఒంటరిగా ఉంటున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడట. తన కుటుంబానికి పరిచయం ఉన్న ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట. ఇటు సినిమాల్లో.. అటు వ్యక్తిగత జీవితంలో ఒకేసారి కొత్త మలుపులు చూడబోతున్నాడు ప్రశాంత్. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios