ట్రాఫిక్ ఉందని ఆ హీరో చేసిన పనికి అంతా షాక్!

Tamil hero Karthi Takes Auto To Chinna Babu Success Meet
Highlights

సమయానికి ప్రెస్ మీట్ కు హాజరు కావాలని వెంటనే తన కారు దిగి ఆటోలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. తన నిర్మాతతో కలిసి ఆటో ఎక్కేశాడు. దీంతో అక్కడున్నవారంతా కూడా ఆశ్చర్యపోయారు

తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు హీరో కార్తీ. రీసెంట్ గా ఆయన నటించిన 'చినబాబు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలుగునాట పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకకు హాజరు కావడం కోసం తన నిర్మాత రవీందర్ తో కలిసి బయలుదేరిన కార్తీ.. హైదరాబాద్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు.

సమయానికి ప్రెస్ మీట్ కు హాజరు కావాలని వెంటనే తన కారు దిగి ఆటోలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. తన నిర్మాతతో కలిసి ఆటో ఎక్కేశాడు. దీంతో  అక్కడున్నవారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది హీరోలు సినిమా ఫంక్షన్స్ సమయంలో గంటల సేపు మీడియా ప్రతినిధులను వెయిట్ చేయించడం జరుగుతూనే ఉంటుంది.

కానీ ఆ సంస్కృతికి భిన్నంగా కార్తీ ఇలా తన గురించి ఎదురుచూస్తోన్న వారికోసం ఆటోలో రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో నటి సాయి పల్లవి కూడా ఇలానే ఈవెంట్ కు ఆలస్యమవుతుందని తన అసిస్టెంట్ బైక్ ఎక్కి సమయానికి ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. 

loader