ఇండియన్ సౌత్ స్టార్స్ కు జపాన్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. తమ అభిమాన హీరోను చూడటం కోసం ఏకంగా జపాన్ నుంచి ఇండియాకు వచ్చేస్తున్నారు. 

మన సౌత్ స్టార్ హీరోలకు జపాన్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు జపాన్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సౌత్ నుంచి కార్తీలాంటి చిన్న హీరోలకు కూడా జపాన్ లో ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా వారు కార్తీనికలవడం కోసం జపాన్ నుంచి చెన్నైకి వచ్చారు. కార్తీ ఇంట్లో వారిని కలిసి దిల్ ఖుష్ అయ్యారు. అంతే కాదు తమ అభిమాన హీరో నటించిన పొన్నియిన్ సెల్వన్ 2ను చూసి ఆనందించారు. 

మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. రీసెంట్ గా ఏప్రిల్ 28న పాన్ ఇండియా వైడ్ గా ఈసినిమా రిలీజయింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 కాస్త బెటర్ అనిపించడంతో పాటు..కలెక్షన్లు కూడా భారీగానే సాధిస్తోంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే పాజిటీవ్ రివ్యూస్ సాధించిన పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ.. ఇప్పటికే దాదాపుగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించగా.. ఆ స్టార్స్ కు దేశ విదేశాల్లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారు ఈసినిమాను చూసి దిల్ ఖుష్ అవుతున్నారు. అయితే చిత్రంగా ఈసినిమాలో నటించి హీరో కార్తీకి సబంధించిన జపాన్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తాజాగా జపాన్ కార్తీ ఫ్యాన్స్ పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా చూడటానికి జపాన్ నుంచి చెన్నై వచ్చారు. తమిళ్ ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో చూడటానికి స్పెషల్ గా జపాన్ నుంచి వచ్చి ఆశ్చర్యపరిచారు.

Scroll to load tweet…

జపాన్ కి చెందిన ఓ ఫ్యామిలీ కార్తీకి వీరాభిమానులు. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాని ఇక్కడి థియేటర్ లో తమిళ్ ఆడియన్స్ తోనే కలిసి చూడాలని కోరుకతో వారు ఎంతో ఖర్చు పెట్టుకుని జపాన్ నుంచి చెన్నైకి వచ్చారు. అంతే కాదు ఈ సినిమాను ఏకంగా నాలుగు సార్లు చూసి దిల్ ఖుష్ అయ్యారు. పొన్నియిన్ సెల్వన్ 2 చూసిన వీరికి.. హీరో కార్తీని కలిసే ఛాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ ఫ్యామిలీ కార్తీ తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. అంతే కాదు కార్తీ వీరికి సాధరంగా ఆతిథ్యం కూడా ఇచ్చాడు. కార్తీ కోసం జపాన్ నుంచి కొన్ని గిఫ్ట్స్ కూడా తెచ్చారు ఆఫ్యామిలీ. కార్తితో ఈ జపాన్ ఫ్యామిలీ దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.