Asianet News TeluguAsianet News Telugu

హీరోగా ధనుష్ తనయుడు, రజినీకాంత్ వారసుడి ఎంట్రీ ఎప్పుడంటే..?

తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు ధనుష్.. ఒక రకంగా చెప్పాలంటే.. సౌత్ లోనే చాలా పెద్ద మార్కెట్ ఉంది ధనుష్ కు. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నా.. ఇప్పటికీ కుర్ర హీరోలానే ఉంటాడు ధనుష్. కాని ఆశ్చర్యం ఏంటంటే.. ధనుష్ కు హీరో వయస్సున్న కొడుకు ఉన్నాడు. త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. 
 

Tamil Hero Dhanush Son Rajinikanth Grandson Yatra Kollywood Entry JMS
Author
First Published Jan 27, 2024, 3:12 PM IST


సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురిని పెళ్ళాడి.. 18 ఏళ్లు హ్యాపీగా కాపురం చేశాడు ధనుష్. కాని ఏమైమందో ఏమో తెలియదు కాని.. వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి.. ఇద్దరు ఇష్టపడి విడిపోయారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ జంట విడిపోయి అప్పుడే 2 సంవత్సరాలు కావొస్తుంది. విడాకులు తీసుకుంటామని అప్పట్లో అధికారిక ప్రకటన చేసినా ఎందుకో తీసుకోలేదు. 

అయితే విడిగా ఉంటూ.. ఎవరి కెరియర్లో వారు బిజీగా ఉన్నారు. కానీ పిల్లల విషయంలో ఇద్దరు బాధ్యతగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. ఎవరికి వారు తమ సినిమా ఈవెంట్లకు.. అఫీషియల్ ఫంక్షన్స్ కు.. పిల్లలను తీసుకుని వెళ్ళడం.. ఎలాగో పిల్లలు పెద్దవళ్లు అయ్యాకే విడిపోయారు కాబట్టి.. పిల్లలకుసమాజంలో గుర్తింపు తీసుకువచ్చే పనులు చేయడంలో ఇద్దరు రెస్పాన్స్ బుల్ గా వ్యవహరిస్తున్నారు. 

ఇక గతంలో హాలీవుడ్ మూవీ చేసినప్పుడు తన పెద్ద కొడుకుని తీసుకుని అక్కడ విజయోత్సవాలుకు వెళ్ళాడు ధనుష్. ఇక రీసెంట్‌గా ఐశ్వర్య డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరిగింది. లాల్ సలామ్ ఐశ్వర్య  డైరెక్ట్ చేసారు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు.

ఇక ఈ  ప్రీరిలీజ్ కార్యక్రమంలో ఐశ్వర్య పెద్ద కుమారుడు యాత్ర, రెండవ కుమారుడు లింగను తీసుకుని రాగా.. ఈ ఫంక్షన్ కు వారు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా ధనుష్ పెద్ద కొడుకు గురించి ఈవెంట్ అంతా హాట్ టాపిక్ నడిచినట్టు తెలుస్తోంది. ధనుష్-ఐశ్వర్య లపెద్ద కొడుకు యాత్ర అచ్చు గుద్దినట్లు ధనుష్‌లాగే ఉన్నాడంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఆడియో ఫంక్షన్‌లో తల్లితో పాటు వీరిద్దరూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Tamil Hero Dhanush Son Rajinikanth Grandson Yatra Kollywood Entry JMS

అంతే కాదు.. యాత్ర త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా..? లోపల మాత్రం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే హ్యాండ్సమ్ గా తయారయిన యాత్ర హీరోగా ఎంట్రీ ఇస్తే.. ధనుష్ అంతవాడుఅవుతాడా..? ధనుష్ కూడా ఈ ఏజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

ఈకుర్ర హీరో  తన తండ్రిలా కష్టపడి ఇమేజ్ బిల్డ్ చేసుకుంటాడా..? లేదా చూడాలి..? అసలు ధనుష్ మంచి ఫామ్ లో ఉండగానే తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వడం సాధ్యమవుతుందా లేదా అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నగానే ఉంది. కాని యాత్ర టాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios