తమిళ నాట స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ.. మంచి ఫామ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజ్ కూడా ఒకరు. హిట్ సినిమాలు చేస్తూ.. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యంగ్ స్టార్.. తాజాగా కాస్ట్లీ కారు కొన్నాడు. మరి ఆ లగ్జరీ కారు కాస్ట్ ఎంతో తెలుసా..?
తమిళ నాట స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ.. మంచి ఫామ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజ్ కూడా ఒకరు. హిట్ సినిమాలు చేస్తూ.. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యంగ్ స్టార్.. తాజాగా కాస్ట్లీ కారు కొన్నాడు. మరి ఆ లగ్జరీ కారు కాస్ట్ ఎంతో తెలుసా..?
లోకేష్ కనగరాజ్.. తమిళనాట సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్లలో ఒకరు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా లోక నాయకుడు కమల్ హాసన్ కే మంచి కమ్ బ్యాక్ ఇచ్చి..విక్రమ్ సినిమాతో కమల్ లైఫ్ లోనే భారీ కలెక్షన్లను కానుకగా ఇచ్చిన దర్శకుడు లోకేష్. అంతే కాదు ఈ దర్శకుడు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ డాన్స్ చేసినవే. విజయ్ లాంటి స్టార్ హీరోకు మాస్టర్ సినిమాతో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్...ప్రస్తుతం అదే విజయ్ తో లియో సినిమా చేశాడు. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
లోకేష్ తో సినిమాలు చేయాలని తమిళ స్టార్ హీరోలతో పాటు.. ఇతర ఇండస్ట్రీల హీరోలు కూడా ఎదరు చూస్తున్నారు. ఇండస్ట్రీలోని హీరోలు వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. గ్యాంగస్టర్ సినిమాలతో ఓ సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు. ఖైదీ, విక్రమ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లనే సాధించాయి.
ఇక మరో విషయం ఏంటంటే.. తమిళనాటు గట్టిగా పారితోషికం అందుకుంటున్న దర్శకులలో లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. తాజాగా ఆయన ఓ కాస్ట్ లీ కారును కొనుగోలు చేశాడు. బీఎండబ్ల్యూ 7 సిరీస్ కు చెందిన లేటెస్ట్ వర్షన్ కారును కొనుగోలు చేశాడు. దీని ధర అక్షరాల 1.70కోట్లు. కారుతో లోకేష్ కనగరాజ్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే గతంలో కూడా లోకేష్ గ్యారేజ్ లో కాస్ట్లీ కార్లు ఉన్నాయి. ఆయన చేసిన విక్రమ్ సినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో.. కమల్‌హాసన్ కూడా లోకేష్‌కు ఓ కాస్ట్ లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.
లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం లియో బిజీలో ఉన్నాడు. మాస్టార్ సూపర్ సక్సెస్ తో.. దళపతి విజయ్ అతనికి మరో అవకాశం ఇచ్చాడు. లియోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో త్రిష , అర్జున్ , సంజయ్ దత్, గౌతమ్ మీనన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా డబ్బింగ్, సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా లియో రిలీజ్ కాబోతోంది. 250 కోట్ల భారీ బడ్జెట్ తో సెవన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ లియో రిలీజ్ కాబోతోంది. తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈసినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
