తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ `బంగారం`లో నటించి ఆకట్టుకున్న కమెడియన్ మదన్ బాబు కన్నుమూశారు.
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్ మదన్ బాబు(71) కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
క్యాన్సర్‌తో మరణించిన మదన్ బాబు
నటుడు మదన్ బాబు మరణానికి కారణం క్యాన్సర్ అని తెలుస్తోంది. చాలా రోజుల క్రితమే ఆయనకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యింది. ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. కానీ దాని తీవ్రత పెరగడంతో పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు కోలీవుడ్ మీడియా పేర్కొంది. మదన్ బాబు మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విచిత్రమైన హవభావాలతో నవ్వులు పూయించిన మదన్ బాబు
మదన్ బాబు గత నాలభై ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణిస్తున్నారు. ప్రారంభంలో కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేసిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. కమెడియన్‌గా టర్న్ తీసుకున్నారు. హాస్యనటుడిగానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. విచిత్రమైన హవభావాలతో ఆకట్టుకున్నారు. నవ్వులు పూయించారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చకున్నారు.
తెలుగులో పవన్ కళ్యాణ్ `బంగారం`లో నటించిన మదన్ బాబు
మదన్ బాబు `1984లో వచ్చిన `నీంన్గల్ కేట్టవై` చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. వరుసగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో విడుదలైన `ఆరు`, `జెమినీ`, `రన్`, `జోడీ`, `మిస్టర్ రోమియో`, `తెనాలి`, `ఫ్రెండ్స్`, `రెడ్` చిత్రాలతో ఆయన తెలుగు ఆడియెన్స్ కి కూడా దగ్గరయ్యారు. మదన్ బాబు తెలుగులో ఒకే ఒక్క సినిమా చేశారు. అది పవన్ కళ్యాణ్ `బంగారం` కావడం విశేషం.
