సినిమాల్లో హీరోగా చేసిన యువ నటుడు నిజ జీవితంలో మాత్రం సొంత భార్యకు విలన్ గా మారాడు. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆమెకు విడాకులు ఇచ్చినట్లు అబద్దాలు చెప్పి మరో యువతిని మోసం చేశాడు. తీరా పోలీసుల వరకు విషయం వెళ్లడంతో పోలీస్ స్టేషన్ లో లోగిపోయాడు. తమిళనాడులో ఈ ఘటన హాట్ టాపిక్ మారింది. 

తమిళ్ సినీ పరిశ్రమలో పయపుళై అనే సినిమా ద్వారా శివ హీరోగా పరిచయమయ్యాడు. అయితే గత కొంత కాలంగా ఇతనికి అవకాశాలు తగ్గడంతో సైడ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.  తిరువణ్ణామలై జిల్లాలోని చెంజి గ్రామానికి చెందిన శివ రామావరరంలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

అయితే స్థానికంగా ఉండే మరో యువతిని ప్రేమలోకి దింపిన యువకుడు ఆమెని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరారయ్యాడు. చివరకు యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అతను అసలు విషయం బయటపడింది. ఇదివరకే పెళ్లయిన శివకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదే విధంగా ఆమెకు విడాకులు ఇవ్వలేదని తేలింది. దీంతో అతనిపై చీటింగ్ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు.