యువ నటుడి భార్య సూసైడ్.. కారణమదేనా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 5, Sep 2018, 1:54 PM IST
tamil actor siddharth gopinath's wife commits suicide
Highlights

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోలీవుడ్ లో మరో విషాదం నెలకొంది.

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. యువనటుడు భర్య ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సిద్ధార్థ్ గోపినాథ్ అనే నటుడు స్మ్రిజ అనే అమ్మాయిని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.

ఇంత కాలమవుతున్నా వీరిద్దరికీ పిల్లలు పుట్టడం లేదనే విషయంపై తరచూ గొడవపడేవారట. లోపం నీలో ఉందంటే నీలో ఉందంటూ ఒకరినొకరు దూషించుకునేవారని సమాచారం. సోమవారం రాత్రి తన భార్యను తీసుకొని హోటల్ వెళ్లి ఇంటికి వచ్చిన సిద్ధార్థ్ మరోసారి భార్యతో గొడవపడ్డాడు. ఈ గొడవ కాస్త ముదరడంతో స్మ్రిజ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందట.

దీంతో సిద్ధార్థ్ హాల్ లోనే పడుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారు జామున భార్య ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో సిద్ధార్థ్ మధురవాయిల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొత్తగా.. స్మ్రిజ ఫ్యాన్ కి ఉరివేసుకొని విగతజీవిగా కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్ధార్థ్ గతంలో ఆది పినిశెట్టితో కలిసి ఓ తమిళ చిత్రంలో నటించారు. ఈ సినిమాను 'మలుపు' పేరుతో తెలుగులో విడుదల చేశారు.

loader