కొంప ముంచిన హోమ్ టూర్ వీడియో.. తమిళ స్టార్ కమెడియన్ కు భారీగా ఫైన్.. అసలేం జరిగిందంటే..?
తమిళ స్టార్ కమెడియన్, నటుడు రోబో శంకర్ (Robo Shankar) తాజాగా నిర్వహించిన ఓం టూర్ తో అటవీ శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆయన ఇంటిపై దాడిచేసిన అటవీశాఖ అధికారులు భారీగా జరిమానా విధించారు.
కమెడియన్, ప్రముఖ తమిళ నటుడు రోబో శంకర్ వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారు. చివరిగా ‘కోబ్రా’,‘కోడై’ చిత్రాల్లో నటించారు. అయితే Robo Shankar సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ సందర్భంగా తాజాగా చెన్సైలోని తన నివాసంలో రోబో శంకర్ హోమ్ టూర్ నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఇంటిలోని అన్ని గదులు, ఇంటాబయట అభిమానులకు చూపించారు. ఆ వీడియోను తన య్యూటూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియోలు ఓ రెండు అరుదైన జాతికి చెందిన రెండు చిలుకలు కూడా కనిపించాయి. దీనిపై ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో వెంటనే ఫారెస్ట ఆఫీసర్స్ రోబో శంకర్ ఇంటిపై దాడి చేశారు. తనిఖీలో ఆ రెండు చిలుకలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి అలెగ్జాండ్రేన్ పారకీట్స్ కు చెందిన అరుదైన జాతికి చెందినవని, వాటిని ఇంట్లో పెంచుకోవాలంటే స్పెషల్ పర్మిషనల్ అవసరమని ఆఫీసర్లు తెలుపుతున్నారు. కొన్నేళ్లుగా అనుమతి లేకుండా చిలుకలను పెండుతుండటంతో ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న రెండు చిలుకలను కిండి చిల్డ్రన్స్ పార్కుకు అప్పగించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అంతేకాకుండా 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం.. ఈ చిలుకలు పెంచుకోవడానికి అనుమతి అవసరం.. కానీ రోబో శంకర్ నిబంధనలను ఉల్లంఘించడంతో అధికారులు అతనికి జరిమానా కూడా విధించారు. ఏకంగా రూ.2.5 లక్షల ఫైన్ వేశారని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ మీడియాలో వైరల్ గా మారుతోంది. 1977 నుంచే నుంచి శంకర్ చిత్రాల్లో నటిస్తున్నారకు. రోబో చిత్రంతో శంకర్ కాస్తా రోబో శంకర్ గా మారిపోయాడు. అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కిచుకుంన్నారు. సినిమాలతోనే కాకుండా ఇలా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తుంటారు.