Asianet News TeluguAsianet News Telugu

Tamannah: తగ్గేదేలే అంటున్న తమన్నా, నిర్మాతపై కోర్టుకు వెళ్తోంది

 తనపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి, తన ఇమేజ్ ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారని తమన్నా చాలా కోపంగా ఉంది. ఈ విషయమై ఆమె లీగల్ గా ముందుకు వెళ్లనుంది.

 

Tamannah Taking Legal Action Against Producer
Author
Hyderabad, First Published Nov 17, 2021, 7:58 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్‌గా ప్రారంభమై ‘మాస్టర్‌ చెఫ్‌’షో నుంచి ఆమెను తొలగించిన వివాదం ఇప్పడిప్పుడే ముగిసేటట్లులేదు. ఆమె స్థానంలోకి స్టార్ యాంకర్‌ అనసూయను తీసుకున్నారు నిర్వాహకులు. దీంతో ఈ షో ప్రొడక్షన్‌ హౌజ్‌కు తమన్నా లీగల్‌ నోటీసులు పంపించింది. తమన్నా లీగల్‌ యాక్షన్‌పై షో నిర్వాహకులు Innovative Film Academy (IFA) ప్రెస్ నోట్ ద్వారా వివరణ ఇచ్చారు. తమన్నా వల్ల దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని నిర్వాహకులు అన్నారు. 

మొత్తం 18 ఎపిసోడ్‌లకు గాను తమన్నాతో రూ. 2 కోట్ల పారితోషికంతో ఆగ్రిమెంట్‌ కుదుర్చుకున్నామని, అయితే ఇతర కమిట్‌మెంట్స్‌ కారణంగా తమన్నా కేవలం 16 రోజుల షూటింగ్‌కు మాత్రమే వచ్చిందని, మిగతా రెండు రోజులు రాలేదని షో నిర్వాహకులు ఆరోపించారు. ఆ రెండు రోజులు రాకపోవడంతో 300 మంది టెక్నిషియన్లు పనిచేస్తున్న తమ షోకు రూ. 5 కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు. అప్పటికే తమన్నాకు కోటిన్నర రూపాయలు ఇచ్చామని, మిగతా రోజుల షూటింగ్‌ కూడా పూర్తి చేసుంటే మొత్తం డబ్బులు చెల్లించేవారమని వారు పేర్కొన్నారు. అంతేగాక అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్ పూర్తి చేయకుండా... సెకండ్ సీజన్ అడ్వాన్స్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అసలు సెకండ్ సీజన్‌కు ఆమెను తీసుకోవాలని తాము అనుకోలేదని నిర్వాహకులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో తనపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి, తన ఇమేజ్ ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారని తమన్నా చాలా కోపంగా ఉంది. ఈ విషయమై ఆమె లీగల్ గా ముందుకు వెళ్లనుంది. తమన్నాకు ఎగ్రిమెంట్ ప్రకారం ఇంకా పేమెంట్ పెండింగ్ ఉందని, ఆ విషయమై కమ్యూనికేషన్ కూడా కట్ చేసారని, తప్పించుకునేందుకు కథలు అల్లుతున్నారని లీగల్ టీమ్ తన వాదనలో కోర్టుకు విన్నవించుకోబోతున్నట్లు సమాచారం. 

తమన్నా హోస్ట్‌గా  ప్రారంభమైన మాస్టర్‌ చెఫ్ షో  కార్యక్రమంలో  వివిధ కారణాల వల్ల సడెన్‌గా ఆమె స్థానంలోకి ప్రముఖ యాంకర్‌ అనసూయని తీసుకొచ్చారు షో నిర్వహకులు. దీంతో ఈ విషయం కాస్తా చర్చనీయాంశం అయ్యింది. తన స్థానంలోకి అనసూయను తీసుకోవడమే కాకుండా, తనకు ఇస్తానన్న రెమ్యునరేషన్‌ కూడా షో నిర్వాహకులు ఇ‍వ్వలేదంటు తమన్నా మాస్టర్‌ చెఫ్‌ నిర్వాహకులపై లీగల్‌ యాక్షన్‌కు దిగినట్లు తెలుస్తోంది. కాగా ఆగస్టు 27న ప్రారంభమైన మాస్టర్‌ చెఫ్‌ తొలి మూడు షోలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత క్రమంగా ఈ షో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Also read సిల్వర్ కలర్‌ ట్రెండీ వేర్‌లో క్లీవేజ్‌ అందాలతో కేకపెట్టిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌

తమన్నా ఇతర సినిమాల విషయానికి వస్తే.. తమన్నా, గోపీచంద్ హీరోగా లేటెస్ట్ సినిమా సీటీమార్‌ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించగా.. సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాతో పాటు తమన్నా నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్‌ మాస్ట్రోలో కీలకపాత్రలో కనిపించారు. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా అదరగొట్టారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.

Also read భోళా శంకర్: తమన్నా నిరాశ చెందిన విషయం అదే!

ఇక ఈ సినిమాతో పాటు తమన్నా.. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన‌్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ F2కు సీక్వెల్‌గా వస్తోన్న F3లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకానుంది. దీంతో పాటు తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటిస్తున్నారు. కన్నడ హిట్ మూవీ 'లవ్ మాక్‌టైల్'కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios