మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు సృష్టించింది.

ఈ సినిమాలో నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి తారలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు తమన్నా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమె లుక్ ని విడుదల చేసింది. యువరాణి గెటప్ లో తమన్నా చాలా అందంగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో ఆమె పేరు లక్ష్మి. ఆమె పాత్రకి సంబంధించిన వివరాలను మాత్రం చిత్రబృందం ప్రకటించలేదు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.