టాలీవుడ్ క్వీన్ సమంత హోస్టుగా మారిన సంగతి తెలిసిందే. తెలుగు ఓ టి టి యాప్ ఆహాలో సమంత సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో నిర్వహిస్తున్నారు. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ టాక్ షోలో విజయ్ దేవరకొండ, రానా, మెగా స్టార్ చిరంజీవి వంటి స్టార్స్ పాల్గొనడం జరిగింది. తాజాగా ఈ షోకి గెస్ట్ గా మిల్కీ బ్యూటీ తమన్నా వచ్చారు. సమంత, తమన్నా మధ్య సరదా సంభాషణలు నడిచాయి. ఈ షోలో సమంత అడిగిన కొన్ని బోల్డ్ ప్రశ్నలకు తమన్నా క్రేజీగా స్పందించారు. 
 
వెండి తెరపై లిప్ లాక్ సీన్ చేయననే రూల్ బ్రేక్ చేస్తే... ఎవరితో ఆ సీన్ లో నటిస్తారని సమంత అడుగగా, విజయ్ దేవరకొండతో చేస్తానని టక్కున చెప్పేసింది తమన్నా.  విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్ లో ఉండగా, ఆయనతో నటించాలనే కోరికను తమన్నా అలా బయటపెట్టారు. ఇక మీరు కవితలు కూడా రాస్తారటగా అని సమంత అడిగారు. దానికి తమన్నా.. మీ హార్ట్ బ్రేక్ అయితే, ఆటోమేటిక్ గా కవి అయిపోతారని అన్నారు. తమన్నా హార్ట్ బ్రేక్ చేసిన ఆ వ్యక్తి ఎవరని సమంత క్రేజీగా స్పందించారు. 
 
ఇక హీరోయిన్ గా 15ఏళ్ల కెరీర్ ముగించిన తమన్నా ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ ముందుకు వెళుతున్నారు. గోపి చంద్ హీరోగా తెరకెక్కుతుం స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ మూవీలో తమన్నా లేడీ కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు. అలాగే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న అందాధున్ హిందీ రీమేక్ లో తమన్నా నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా చిత్రాలు చేస్తున్నారు తమన్నా.