సుజోయ్ ఘోష్ లస్ట్ థీమ్‌తో రూపొందించిన ఆంథాలజీ ‘లస్ట్ స్టోరీస్ 2’ (Lust Stories2) కోసం ఆరు రోజుల పాటు బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోస్‌లో వీరిద్దరూ షూటింగ్‌లో పాల్గొన్నారు.
‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ హిందీ వర్షన్‌లో స్వయంతృప్తి పొందే గృహిణిగా నటించి కియారా అద్వానీ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పోషించిన ఈ పాత్ర దేశవ్యాప్తంగా ఉన్న యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ అంటే పార్ట్ 2 రాబోతోంది. ఈ రెండవ పార్ట్ మరింత హాట్ గా ఉండబోతోందని వినికిడి. ఇందులో తమన్నా ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందంటున్నారు.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో హైలెట్ కాని ఫీమేల్ సెక్సువాలిటీ టాపిక్‌తో సాగే ఈ సీరిస్ కు అప్పుడు అనురాగ్ కశ్యప్, దీబాకర్ బెనర్జీ, జోయా అఖ్తర్, కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, విక్కీ కౌశల్, నేహా దూపియా, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ కల్ట్ వెబ్ సీరిస్ కు సీక్వెల్ ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లింది. ఎంసీఏ చిత్రంలో విలన్‌గా నటించిన హైదరాబాదీ నటుడు విజయ్ వర్మ లీడ్ రోల్‌లో కనిపించనున్నాడని టాక్. అంతేకాదు మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) సీక్వెల్‌లో భాగస్వామ్యం కానుంది.
సుజోయ్ ఘోష్ లస్ట్ థీమ్‌తో రూపొందించిన ఆంథాలజీ ‘లస్ట్ స్టోరీస్ 2’ (Lust Stories2) కోసం ఆరు రోజుల పాటు బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోస్‌లో వీరిద్దరూ షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఇది పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సిరీస్.. 2023 లోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
తమన్నా భాటియా ప్యూచర్ ప్రాజెక్టుల విషయానికొస్తే.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘భోలా శంకర్’ సినిమాతో పాటు మలయాళంలో దిలీప్‌తో కలిసి ‘బాంద్రా’ చిత్రంలో కనిపించనుంది. మరోవైపు నటుడు విజయ్ వర్మ ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ చిత్రంలో కనిపించనున్నాడు. దీనికి బాలీవుడ్ డైరెక్టర్ సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇక గతేడాది అలియా భట్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో నటించిన ‘డార్లింగ్స్’ మూవీలో హంజా షేక్ పాత్రలో విజయ్ తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఇదే గాక తను నటించిన ‘మీర్జాపూర్ 3’ కూడా ప్రస్తుతం రిలీజ్ కావాల్సి ఉంది.
