తమన్నాకి అమెరికాలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా..? అని కామెంట్ చేస్తున్నాడు తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్. అయితే ఆయన ఏ సందర్భంలో కామెంట్ చేయాల్సి వచ్చిందంటే..? ప్రస్తుతం తమన్నాఇతగాడితో కలిసి 'కన్నే కలైమానే' అనే సినిమాలో నటిస్తోంది.

ఫిబ్రవరి 1న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో కొందరు అభిమానులతో ముచ్చటించింది తమన్నా.. ఓ అభిమాని 'నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నన్ను పెళ్లి చేసుకుంటావా తమన్నా.. అది సాధ్యమేనా..?' అని ప్రశ్నించాడు.

దానికి ఆమె సామధానం ఇచ్చేలోపు హీరో ఉదయనిధి స్టాలిన్ కల్పించుకొని.. 'అది ఎప్పటికీ జరగదు. తమన్నాకి అమెరికాలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీకు తెలియదా..?' అని ప్రశ్నించాడు. అంతే ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

చాలా రోజులుగా తమన్నా పెళ్లి గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ తో నిజంగానే తమన్నాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే ప్రచారం జోరందుకుంది.