అభిమానులు ముద్దుగా పిలుచుకునే మిల్కీ బ్యూటీ తమన్నా.. షాక్‌ ఇచ్చింది. అటు చిత్ర యూనిట్‌కి, ఇటు అభిమానులను సర్‌ప్రైజ్‌కి గురి చేసింది. ఏకంగా బస్‌ని డ్రైవింగ్‌ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేసింది. తమన్నా ప్రస్తుతం `సీటీమార్‌` చిత్రంలో నటిస్తుంది. గోపీచంద్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. మహిళా కబడ్డీ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ఇందులో తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్‌ జ్వాలా రెడ్డిగా తమన్నా నటిస్తుంది. ఇటీవల విడదలైన ఆమె లుక్‌ ఆకట్టుకుంది. 

ఇదిలా ఉంటే `సీటీమార్‌` సెట్‌లో అందరిని షాక్‌కి గురిచేసింది తమన్నా. అక్కడ బస్‌ని డ్రైవ్‌ చేసింది. పక్కన డ్రైవర్‌ని కూర్చోబెట్టుకుని సెట్‌లో కలియ తిరిగింది. మాస్క్ ధరించి బస్‌ని డ్రైవర్‌ చేస్తూ దిగిన వీడియోని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఓ స్టార్ హీరోయిన్‌ ఉన్నట్టుండి ఇలా బస్‌ని డ్రైవ్‌ చేయడంతో యూనిట్‌ మొత్తం ఆశ్చర్యానికి గురయ్యింది. ఆమె డ్రైవింగ్‌ స్కిల్స్ ని శెభాష్‌ చెబుతున్నారు. అయితే ఫస్ట్ టైమ్‌ తమన్నా ఇలా డ్రైవింగ్‌ సీట్‌లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటుంది. తమన్నా డ్రైవింగ్‌ స్కిల్స్ కి ఫిదా అవుతున్నారు. ఈ వీడియోని వైరల్‌ చేస్తున్నారు. 

ఇటీవల కరోనాకి గురై కోలుకున్న తమన్నా ప్రస్తుతం తెలుగులో `సీటీమార్‌`తోపాటు నితిన్‌ చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్‌ సినిమా `అంధాధున్‌` రీమేక్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. నెగటివ్‌షేడ్స్ ఉన్న పాత ఆమెది. దీనికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే యంగ్‌ హీరో సత్యదేవ్‌తో కలిసి `గుర్తుందా సీతాకాలం`, `ఎఫ్‌3` హిందీలో `బోల్‌ చుదియన్‌` చిత్రంలో నటిస్తూ బిజీగా ఉందీ సెక్సీ బ్యూటీ.