2016 లోనే సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ మూవీ విడుదల కాలేదు. ఈ చిత్రం సౌత్ రీమేక్ రైట్స్ విషయంలో వచ్చిన కొన్ని వివాదాల కారణం చేత సినిమా రిలీజ్ ఆగిపోయింది.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన చిత్రం'' దట్ ఈజ్ మహాలక్ష్మి ''. ఈ సినిమా కి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇది బాలీవుడ్ చిత్రం క్వీన్ ఆధారంగా తెలుగులో దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమా 2014 లో ప్రకటించారు. మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయి ఇప్పటికే దాదాపు ఎనిమిది ఏళ్ళు అవుతుంది. తాజాగా ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది అని ప్రచారం సాగుతోంది.
2016 లోనే సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ మూవీ విడుదల కాలేదు. ఈ చిత్రం సౌత్ రీమేక్ రైట్స్ విషయంలో వచ్చిన కొన్ని వివాదాల కారణం చేత సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా పూర్తయి ఇప్పటికే ఎనిమిదేళ్లు కావడంతో థియేటర్లో రిలీజ్ చేస్తే మూవీ ని ప్రేక్షకులు ఆదరించడం కష్టం.
అందుకే నెట్ ఫ్లిక్స్ తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా త్వరలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ రానుంది. అయితే .. ఈ చిత్రం లో డీజే టిల్లు హీరో సిద్ధూ జొన్నల గడ్డ కీలక పాత్రలో కనిపించారట. గతంలో కూడా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొచ్చాయి.
