సౌత్ ఇండియాలో గాలి తాకినా కందిపోయేలా కనిపించే బ్యూటీల చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. హ్యాపీ డేస్ నుంచి ఇప్పటివరకు జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. దాదాపు స్టార్ హీరోలందరిని కవర్ చేసింది. 

ఇక వీలైనప్పుడల్లా కుర్ర హీరోలతో కూడా అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం మిల్కి బ్యూటీ నెక్స్ట్ ఏంటి సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది. ఎప్పుడు లేని విధంగా వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ రొమాంటిక్ సినిమాలో అమ్మడు చేసిన పాత్ర తన నిజజీవితంలోకి చాలా దగ్గరగా ఉంటుందని చెబుతోంది. 

అదే విధంగా దాదాపు తెరపై కనిపించబోయేది తనే అంటూ.. సినిమా చుస్తే నా రియల్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని, డైలాగ్స్ నాకు పర్సనల్ గా కనెక్ట్ అయ్యాయని బాగా నచ్చాయి అంటూ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక హ్యాపీ డేస్ - 100% లవ్ సినిమాల తరువాత తనకు క్లోజ్ గా ఉండే పాత్రలు రాలేవని ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సినిమాతో మళ్ళీ మనసుకు దగ్గరైన పాత్ర దొరికింది అని తమన్నా వివరణ ఇచ్చింది.  సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. మరి ప్రమోషన్స్ డోస్ పెంచుతున్న తమన్నకు ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.