తమన్నా ప్రస్తుతం సైరా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక తమిళంలో విశాల్ సరసన యాక్షన్ చిత్రంలో నటిస్తోంది. యాక్షన్ మూవీ లో తమన్నా అందాలు ఆరబోసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా తమన్నాని మరో అవకాశం వరించినట్లు తెలుస్తోంది. 

తమన్నా తొలిసారి హీరో గోపీచంద్ తో రొమాన్స్ చేయబోతున్నట్లు టాక్. గోపీచంద్ తదుపరి మూవీ సంపత్ నంది దర్శకత్వంలో ఉండబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో గౌతమ్ నంద చిత్రం వచ్చింది. మరో కమర్షియల్ చిత్రాన్ని వీళ్లు సిద్ధం అవుతున్నారు. 

దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రం కోసం తమన్నాని హీరోయిన్ గా ఎంపిక చేశాడట. ఇదే కనుక నిజమైతే సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా మూడో చిత్రంలో నటించినట్లు అవుతుంది. ఇదివరకే తమన్నా రచ్చ, బెంగాల్ టైగర్ చిత్రాల్లో సంపత్ దర్శకత్వంలో నటించింది. ఆరెండు చిత్రంలో సంపంత్ నంది మిల్కీ బ్యూటీ ని మరింత గ్లామర్ గా చూపించాడు.