మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా సైరా పెద్దఎత్తున రిలీజవుతోంది. ఇప్పటికే ముంబైలో మీడియా కోసం ప్రదర్శించిన స్పెషల్ షో నుంచి చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 

సురేందర్ రెడ్డి దర్శకత్వం నటీనటులు పెర్ఫామెన్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటనకు అందరి దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. సైరా సాంగ్స్ లో తమన్నా స్క్రీన్స్ ప్రెజన్స్ కి ఫిదా అవుతున్నారు. తమన్నా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా అదరగొట్టేసింది. 

ఇదిలా ఉండగా ముఖ్యంగా క్లైమాక్స్ లో తమన్నా నటన మతిపోగొట్టేవిధంగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమన్నా మునుపెన్నడూ చూడని విధంగా నటనతో అదరగొట్టినట్లు తెలుస్తోంది. తమన్నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి.