అడ్వాన్స్ ఇవ్వలేదు, చిరు సినిమాలో ఉన్నానా లేదా?

తమన్నాని.. చిరంజీవి సినిమాలో  హీరోయిన్ అడిగినా ఇంకా అడ్వాన్స్ పంపలేదట. దాంతో ఆమె వేరే ప్రాజెక్టు సైన్ చేయాలా లేక డేట్స్ ఖాళీ పెట్టుకోవాలా అర్దంకాని సిట్యువేషన్ లో ఉందని మీడియా వర్గాల సమచారం.  ఇప్పుడామె ఓ బాలీవుడ్ ప్రాజెక్టు సైన్ చేస్తోంది. ఇంతకీ ఆమెను ఎప్రోచ్ అయిన సినిమా ఏంటంటే...

Tamannaah is yet to receive advance payment for Chiranjeevi movie

సాధారణంగా ఓ సినిమా కమిటయ్యితే వెంటనే స్టార్స్ కు,మెయిన్ టెక్నీషియన్స్ అడ్వాన్స్ ఇస్తారు. తర్వాత ఎగ్రిమెంట్ కుదుర్చుకుని డేట్స్ ఫైనలైజ్ చేసుకుంటారు. అయితే కొంత డైలమా ఉన్నప్పుడు వెయిటింగ్ మోడ్ లో ఉంచుతారు. అలాంటిదేమన్నా జరుగుతోందా తమన్నా(Tamannah) విషయంలో అనే సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమెను చిరంజీవి(Chiranjeevi) సినిమాలో  హీరోయిన్ అడిగినా ఇంకా అడ్వాన్స్ పంపలేదట. దాంతో ఆమె వేరే ప్రాజెక్టు సైన్ చేయాలా లేక డేట్స్ ఖాళీ పెట్టుకోవాలా అర్దంకాని సిట్యువేషన్ లో ఉందని మీడియా వర్గాల సమచారం.  ఇప్పుడామె ఓ బాలీవుడ్ ప్రాజెక్టు సైన్ చేస్తోంది. ఇంతకీ ఆమెను ఎప్రోచ్ అయిన సినిమా ఏంటంటే...

మెగాస్టార్ చిరంజీవి  వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` పూర్తైంది. ఇప్పుడు  మలయాళీ `లూసీఫర్` రీమేక్ చిత్రం `గాడ్ ఫాదర్‌` చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ `వేదాళం` రీమేక్ గా `భోళా శంకర్`(Bhola Shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా Tamannah  అడిగారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన `సైరా` చిత్రంలో తమన్నా తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి.  అయితే `భోళా శంకర్` షూటింగ్ వాయిదా పడేటట్లు ఉందని సమాచారం.

God Father సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే Bhola Shankar సినిమాను చిత్రీకరించబోతున్నట్లుగా మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. `భోళా శంకర్` సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు మళ్లీ కాస్త సమయం కావాలని చిరంజీవి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మెహర్ రమేష్‌ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గత ఏడాది లోనే మొదలు పెట్టాలని భావించినా కూడా మొదలు కాలేదు. మొన్నటి వరకు భోళా శంకర్ ను నవంబర్ లేడా డిసెంబర్‌ ప్రారంభం అన్నారు.

also read: 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీం సక్సెస్ పార్టీ.. ఫుల్ జోష్ లో అఖిల్, పూజా హెగ్డే

కాని ఇప్పడు మాత్రం అంతకు ముందు బాబీ దర్శకత్వం లో ఒక సినిమాను చేసేందుకు గాను సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్ కు భోళా శంకర్ ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అందుకే తమన్నా కు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకోలేదని సమాచారం. తమన్నా ప్రస్తుతం నాగార్జునతో ది ఘోస్ట్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మొదట కాజల్ ని అనుకున్నారు. కానీ ఆమె ప్రెగ్నిన్సీ రావటంతో ప్రక్కకు తప్పుకుంది. ఇప్పుడు తమన్నా సీనియర్ హీరోలకు ఆప్షన్ గా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios