నువ్వు నాలో సగం.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌పై తమన్నా కామెంట్స్ వైరల్..
మిల్కీ బ్యూటీ తమన్నా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నువ్వు నాలో సగం అంటూ అందరి ముందు చెప్పేసింది. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ తమన్నా మిల్కీ బ్యూటీగా పాపులర్ అయ్యింది. ఇన్నాళ్లపాటు మిల్కీ బ్యూటీగా తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. అభిమానులు ముద్దుగా ఆమెని మిల్కీ బ్యూటీగా పిలుచుకుంటాడు. ఆ ట్యాగ్ చాలా పాపులర్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా `మిల్కీ బ్యూటీ` పేరుతో పాటనే తీసుకొచ్చారు. అది కూడా చిరంజీవి సినిమాలో పెట్డడం విశేషం. చిరంజీవి హీరోగా నటిస్తున్న `భోళాశంకర్` చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో `మిల్కీ బ్యూటీ` అనే పేరుతోనే పాటని పెట్టారు. సాగర్ మహతి సంగీతం అందించిన ఈ పాటని తాజాగా విడుదల చేశారు. చిరంజీవి, తమన్నాలపై వచ్చే మంచి కూల్ మెలోడీ సాంగ్ ఇది. విడుదలై ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనూ ఉంది.
ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (థమన్) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో తమన్నా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రారంభంలోనే తనని `మిల్కీ బ్యూటీ` అని పిలిచేవారు. అలా ఎందుకు పిలుస్తున్నారో మొదట అర్థమయ్యేది కాదు, నా కలర్ గురించి అలా పిలుస్తున్నారని తెలిసింది. అయితే కేవలం కలర్‌ని ప్రతిబింబించేలా అలా పిలవడం లేదు, అందులో ఆడియెన్స్ లో నాపై ఉన్న ప్రేమని వాళ్లు అలా వ్యక్తం చేస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రేమని ఇన్నాళ్లు అందిస్తూనే ఉన్నారు. ఇందులో చిరంజీవిగారితో నటించడం, పైగా తన పేరుతో రాసిన పాటకి చిరంజీవితో స్టెప్పులేయడం చాలా హ్యాపీగా ఉంది అని తెలిపింది తమన్నా.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్‌పై తమన్ ప్రశంసలు కురిపించింది. తమన్ కి నేను ప్రతిసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన నాకు థ్యాంక్స్ చెబుతుంటారు. ఎందుకంటే నువ్వు నాలో సగం. సెట్‌లో చిరంజీవి గా ఎప్పుడూ తమన్ అంటూ నన్ను పిలుస్తుంటారు. ఆ కారణంతో సెట్‌లో నువ్వు కూడా ఉన్నావనే భావన కలుగుతుంది. నువ్వు లేకపోతే అందరి లైఫ్ ఇన్ కంప్లీట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే నీ పాటలతో అందరిని ప్రభావితం చేస్తావు` అని వెల్లడించిందీ తమన్నా. తమన్నా(Tamannaah పేరులో తమన్(Thaman) పేరు సగం వస్తుంది. ఆ ఉద్దేశ్యంలో తమన్నా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఫన్నీ కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న `భోళాశంకర్` చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. కీర్తిసురేష్ చిరుకి చెళ్లిగా చేస్తుంది. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందుతున్న మాస్ కమర్షియల్ చిత్రమిది. తమిళంలో హిట్ అయిన `వేదాళం`కి రీమేక్. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. దీంతోపాటు రెండు పాటలు విడుదలయ్యాయి. ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరో సాంగ్‌ని లాంచ్ చేశారు. ఇక సినిమాని ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.