ముంబై భామ తమన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా కాలం గడుపుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

డేటింగ్ కి వెళ్లే అవకాశం వస్తే ఎవరితో వెళ్తారని ఆమెని ప్రశ్నిస్తే.. దానికి తమన్నా వెంటనే విక్కీ కౌశల్ పేరు చెప్పింది. బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో విక్కీ కౌశల్ కి క్రేజ్ బాగా పెరిగింది. 'ఉరి: సర్జికల్ స్ట్రైక్స్' లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ నటుడికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

తమన్నా కూడా అదే విషయాన్ని వెల్లడించింది. ఆ తరువాత మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ.. ఎవరెవరో ఏవేవో ఆరోపణలు చేస్తుంటారని, కేవలం తమకు ఎదురైన అనుభవాల గురించి చర్చించుకోవడానికే మీటూ ఉద్యమం ఉందని చెప్పింది.

వాటి గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలని, కానీ ఒక్కోసారి ఇదేదో ఆటలా మారిపోయిందని అనిపిస్తున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'దేవి 2', 'దటీజ్ మహాలక్ష్మి' వంటి చిత్రాల్లో నటిస్తోంది.